New Delhi, March 19: భారత్‌లో కరోనా తీవ్రత (India Corona) తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2075 కరోనా కేసులు నమోదవగా, 71 మంది మరణించారు (Corona Deaths). దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరగా, 5,16,352 మంది మరణించారు. మొత్తం కేసుల్లో 4,24,61,926 మంది బాధితులు కోలుకోగా(Recoveries), 27,802 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 3,383 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ (Central Health Ministry)వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06 శాతం మాత్రమేనని, రికవరీ రేటు 98.72 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 1.20 శాతంగా ఉందని పేర్కొన్నది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.35గా (Daily Positivity Rate) ఉన్నదని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,81,04,96,924 కరోనా వ్యాక్సిన్ డోసులను (Corona Vaccination)పంపిణీ చేశామని తెలిపింది.
India reports 2,075 fresh #COVID19 cases, 3,383 recoveries, and 71 deaths in the last 24 hours.
Active cases: 27,802 (0.06%)
Daily positivity rate: 0.56%
Total recoveries: 4,24,61,926
Death toll: 5,16,352
Total vaccination: 1,81,04,96,924 pic.twitter.com/1pJLHFTFKh
— ANI (@ANI) March 19, 2022
అయితే ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులతో కేంద్రం అప్రమత్తమైంది. నాలుగో వేవ్ వచ్చే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బూస్టర్ డోసుల పంపిణీపై దృష్టి సారించాలని కోరింది. ఇక టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ పద్దతుల ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని సూచించింది. అన్ని రాష్ట్రాలు నిబంధనల అమలుపై దృష్టిసారించాలని కోరింది.