Coronavirus in India: కరోనా థర్డ్ వేవ్‌లో అత్యధిక మరణాలు, పెరుగుతున్న రికవరీలు, తగ్గుతున్న పాజటివిటీ రేటు, వ్యాక్సినేషన్‌ లోనూ భారత్‌ రికార్డ్
Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

New Delhi January 30: భారత్‌లో కరోనా తీవ్రత(Corona Cases) క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదు కాగా, 893 మంది మృతి చెందారు. కరోనా థర్డ్ వేవ్‌ (Third wave)లో ఇవే అత్యధిక మరణాలు. అయితే కరోనా కొత్త కేసుల కంటే కోలుకున్న(Recovery) వారి సంఖ్య పెరిగింది. ఇది కొంత ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,52,784 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ప్రస్తుతం 18,84,937 యాక్టీవ్ కేసులున్నాయి (CORONA ACTIVE CASES). ఇక డైలీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉంది.

కరోనా వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,65,70,60,692 కరోనా వ్యాక్సినేషన్ డోసులను పంపిణీ చేశారు. అంతేకాదు దేశజనాభాలో అర్హులైన 75శాతం మందికి రెండు డోసులను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవియా ట్వీట్ చేశారు.

ఇక శనివారం ఒక్క‌రోజే 53 ల‌క్ష‌ల మందికి పైగా కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్న‌ట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 18 నుంచి 44 ఏండ్ల వ‌య‌సున్న వారిలో 53,96,51,188 మంది మొద‌టి డోసు తీసుకోగా, 40,19,58,479 మంది రెండు డోసులు తీసుకున్నారు.

మొత్తం దేశ వ్యాప్తంగా 93,87,16,725 మొద‌టి డోసు తీసుకోగా, 70,57,49,826 మంది రెండు డోసులు తీసుకున్నారు. 15 నుంచి 18 ఏండ్ల వ‌య‌సున్న వారిలో 4,55,48,237 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 1,16,18,975 మంది బూస్ట‌ర్ డోసు తీసుకున్న‌ట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.