Coronavirus | Representational Image (Photo Credits: ANI)

New Delhi January 18: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ ( Third wave) కొనసాగుతోంది. అయితే రోజువారీ కేసుల్లో మాత్రం తగ్గదల కనిపిస్తోంది. గత రెండు రోజులుగా కేసుల సంఖ్య (Daily corona cases) తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,38,018 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ(Health Ministry of India) తెలిపింది. నిన్నటితో పోలిస్తే 20,071 కేసులు తగ్గాయి. మరో వైపు కరోనాతో 310 మరణాలు (corona deaths) నమోదయ్యాయి. అటు కరోనా (Corona) నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 1,57,421 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉందని తెలిపింది.

ఇక ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) మాత్రం ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 8,891 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 8.31శాతం పెరిగాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,76,18,271కు చేరింది. ఇందులో 3,53,94,882 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 4,86,761 మంది మృత్యువాతపడ్డారు. అటు వ్యాక్సినేషన్(Corona vaccination) ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 158.04 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే దాదాపు 80 లక్షలకు పైగా వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.