Coronavirus outbreak in TS (Photo Credits: IANS)

New Delhi, January 28: భారత్‌లో కరోనా (Corona)తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గురువారంతో పోలిస్తే ఇవాళ కరోనా రోజువారీ కేసులు(Daily Corona Cases) తగ్గాయి. అంతేకాదు రికవరీలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో డైలీ పాజిటివిటీ రేటు(Daily Positivity rate) కూడా తగ్గుతూ వస్తోంది. కానీ మరణాల్లో మాత్రం వృద్ది కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం 2.8 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, నేడు 2.51 లక్షలకు తగ్గాయి. దేశంలో కొత్తగా 2,51,209 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,06,22,709కి చేరాయి. ఇందులో 3,80,24,771 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా (Recovery), 4,92,327 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 21,05,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇక గత 24 గంటల్లో కొత్తగా 627 మంది మరణించగా, 3,47,443 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ(Health ministry of India) తెలిపింది. కరోనా కేసులు తక్కువవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 15.28 శాతానికి తగ్గింది. ఇక ఇప్పటివరకు 1,64,44,73,216 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.