Coronavirus Outbreak (Photo credits: IANS)

New Delhi, Feb 16: భారత్‌లో కరోనా తీవ్రత (Corona) తగ్గుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే...ఇవాళ కరోనా కొత్త కేసులు(Corona Cases) స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 24 వేల కేసులు నమోదవ్వగా బుధవారం నాడు 30వేలకు పైగా కేసులు రికార్డయ్యాయి. నిన్నటితో పోలిస్తే 11 శాతం డైలీ కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 30,615 కొత్త కేసులు నమోదు కాగా, 514 మంది మృతి చెందారు(Corona Deaths). దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,27,23,558కి, మరణాలు 5,09,872కి చేరాయి. కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.దీంతో యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది.మొత్తం బాధితుల్లో 4,18,43,446 మంది కోలుకోగా (Recovery), 3,70,240 మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో 82,988 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉంది.

ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ (Vaccination) కూడా వేగవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 173.86 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. యువజనుల వ్యాక్సినేషన్ కూడా వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 1.5 కోట్ల మందికి పైగా 15-17 వయస్సుగల వారు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ (Kerala) మొదటిస్థానంలో ఉంది. అక్కడ నిన్న 11వేలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కేవలం జమ్మూకశ్మీర్, మహారాష్ట్రలో అధికంగా కేసులున్నాయి.