New Delhi Feb 09: భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50,407 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం తొలినాళ్ల కంటే ఎక్కువగా ఉంటోంది. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 804 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,07,981కి చేరింది.
ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 1,36,962 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య (Corona Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,10,443 యాక్టీవ్ కేసులున్నాయి. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate) భారీగా తగ్గింది. ప్రస్తుతం 3.48 శాతంగా ఉంది.
India reports 50,407 fresh #COVID19 cases, 1,36,962 recoveries and 804 deaths in the last 24 hours.
Active cases: 6,10,443 (1.43%)
Death toll: 5,07,981
Daily positivity rate: 3.48%
Total vaccination: 1,72,29,47,688 pic.twitter.com/xy9AJY5K4g
— ANI (@ANI) February 12, 2022
పలు రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో రోజువారీ కేసులు మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కేరళలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. అటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 172 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రికాషనరీ డోసుల పంపిణీని వేగవంతం చేశారు. 15-17 సంవత్సరాల మధ్యవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.