Coronavirus-in-India ( photo-PTI)

New Delhi December 23: భారత్‌లో కరోనా(India Corona cases) తీవ్రత క్రమంగా పెరుగుతోంది. చాలా నెలల తర్వాత రికవరీల(Recovery) కంటే కొత్త కేసులు అధికంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 7,495 కరోనా కేసులు నమోదు కాగా, 434 మంది కరోనా బారినపడి మరణించారు. నిన్న 6,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా రికవరీలతో 3,42,08,926 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 78,291 యాక్టీవ్ కేసులున్నాయి.

Telangana Omicron Cases: ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు, తెలంగాణ కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్, మొత్తం 38కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ఇక కరోనా మహమ్మారి ఇప్పటివరకు 4,78,759 మంది మృతి చెందారు.   ఇక వ్యాక్సినేషన్(vaccination) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 139 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. డిసెంబర్ చివరి వరకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

అటు భారత్‌లో ఒమిక్రాన్ తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీలో అత్యధికంగా ఒమిక్రాన్(Omicron) కేసులుండగా, మహరాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్‌ల్లో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు భారత్‌లో 236 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.