International Arrivals :ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పునఃప్రారంభానికి మరోసారి బ్రేక్, ఒమిక్రాన్ భయంతో వెనక్కు తగ్గిన కేంద్రం, అంతర్జాతీయ ప్రయాణాలపై ఫుల్ ఎఫెక్ట్
Image used for representational purpose | (Photo credits: Pixabay)

New Delhi November 29: అంతర్జాతీయ విమాన సర్వీసుల(International Arrivals) పునరుద్దరణపై కేంద్రం(Central Govt.) పునరాలోచనలో పడింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) వల్ల అంతర్జాతీయ ప్రయాణాలపై పలు దేశాలు ఇప్పటికే నిషేదం విధించాయి. ఈ సమయంలో భారత్‌(India) అంతర్జాతీయ సర్వీసులను పునః ప్రారంభించడం సరైంది కాదని భావిస్తోంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి సుమారు 20 నెలలుగా అంతర్జాతీయ విమానాలను (International Arrivals)  నడపడం లేదు. 31 దేశాలతో  ఎయిర్‌ బబుల్‌(Air Babul) ఒప్పందం మేరకు గత ఏడాది జులై నుంచి కొన్ని సర్వీసులు నడుస్తున్నాయి. అయితే దేశంలో కరోనా పరిస్థితి అదుపులోకి రావడంతో డిసెంబర్‌ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ నెల 26న కేంద్రం ప్రకటించింది.

WHO on Omricon: కరోనా కొత్త వేరియంట్‌పై డబ్లూహెచ్‌వో కీలక సూచనలు, అప్రమత్తతే కాపాడుతుందంటున్న నిపుణులు, ఎప్పటికప్పుడు ట్రాకింగ్ లేకపోతే వినాశనం తప్పదన్న ఆరోగ్యసంస్థ

మరోవైపు కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్(Omcron) పలు దేశాల్లో అలజడి రేపుతున్నది. ఈ కొత్త వేరియంట్ ఇతర కోవిడ్ వేరియంట్‌ల కంటే ప్రాణాంతకమని, వేగంగా వ్యాపిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభ తేదీ, వ్యూహంపై కేంద్ర హోంశాఖ(MHA) సమీక్షించింది.

కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న కరోనా వేరియంట్‌ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయాన్ని సమీక్షించారు. నీతి ఆయోగ్(Niti Ayog) సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్, ప్రధానమంత్రి ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు విజయ్ రాఘవన్, ఆరోగ్యం, పౌర విమానయానం, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో సహా వివిధ రంగాల నిఫుణులు ఇందులో పాల్గొన్నారు.