New Delhi, AUG 08: బంగ్లాదేశ్‌లో (Bangladesh Riots) మైనారిటీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ విదేశాంగ మంత్రి ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకున్నారన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిపై సమాచారం తీసుకుంటున్నామని.. బంగ్లాలోని కొన్ని సంఘాలు మైనారిటీలకు సహాయం చేస్తున్నాయని మాకు సమాచారం అందిందన్నారు. ఆయా చర్యలను స్వాగతిస్తున్నామని.. అయితే, బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు పునరుద్ధరించాలని చెబుతున్నామన్నారు.
#WATCH | Delhi: On recent elections in Venezuela, MEA Spokesperson Randhir Jaiswal says, "We have been following the developments in Venezuela since the recent presidential elections. We hope there is a peaceful resolution of the issue..." pic.twitter.com/r0Oi2WMWPN
— ANI (@ANI) August 8, 2024
పౌరులందరికీ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేయాలనుకుంటున్నామన్నారు. రెండు దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు ఇది చాలా ముఖ్యమన్నారు. బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితులపై రణధీర్ జైస్వాల్ (Jaiswal) మాట్లాడుతూ మళ్లీ బంగ్లాదేశ్‌లో పరిస్థితి దిగజారుతోందన్నారు. సాయంత్రం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం ఉందన్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో భారత్ తరఫున తమ రాయబారి సైతం పాల్గొంటారన్నారు. బంగ్లాదేశ్ పౌరుల భద్రత భారత ప్రభుత్వానికి, ప్రజలకు అత్యంత ప్రాధాన్యత అని చెబుతున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితికి సంబంధించి బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (Jaishankar) మధ్య చర్చ జరిగిందన్నారు. బంగ్లాదేశ్, పశ్చిమాసియాలో పరిస్థితి పురోగతిపై ఇరువురు నేతలు చర్చించారన్నారు. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు రాజకీయ ఆశ్రయం కల్పించే అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. తక్కువ వ్యవధిలో భారత్‌కు వస్తామని షేక్ హసీనాకు సమాచారం అందించినట్లు మా విదేశాంగ మంత్రి ఇప్పటికే తెలిపారన్నారు. బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. హింసాకాండ కొనసాగుతుందన్నారు.