అరేబియా సముద్రంలో ఇటీవల వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్ దాడులు జరిగిన సంగతి విదితమే. సౌదీ అరేబియా నుంచి భారత్‌లోని మంగళూరు వస్తున్న క్రూడాయిల్ నౌక కెమ్ ఫ్లూటోపై పోర్‌బందర్ తీరానికి 400 నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరిగింది. దీని తర్వాత తర్వాత ఎర్ర సముద్రంలో మరో క్రూడాయిల్ నౌకపైనా డ్రోన్ దాడి జరిగింది.
ఈ నేపధ్యంలో ఇండియన్ నేవి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సముద్రంలో గస్తీ కోసం మూడు ఐఎన్‌ఎస్ వార్‌షిప్పులను రంగంలోకి దింపింది. వీటితో పాటు తీరంలో పెట్రోలింగ్ విమానాలతో నిఘా ఉంచనుంది.
‘ఇటీవల వాణిజ్య నౌకలపై పెరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని మూడు వార్‌షిప్పులను పశ్చిమ తీరంలో గస్తీ కోసం రంగంలోకి దింపాం. వీటికి మిసైళ్లను, డ్రోన్‌లను అడ్డుకుని నాశనం చేసే సామర్థ్యం ఉంది. ఇవి కాక లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ విమానాలు తీరం వెంబడి నిఘా పెడతాయి. కోస్ట్‌గార్డ్‌లతో సమన్వయం చేసుకుని పరిస్థితిని నిషితంగా పరిశీలిస్తున్నాం’ అని నేవీ వెస్టర్న్ కమాండ్ అధికారి ఒకరు తెలిపారు.
కాగా క్రూడాయిల్ నౌక కెమ్ ఫ్లూటోపై పోర్‌బందర్ తీరానికి 400 నాటికల్ మైళ్ల దూరంలో దాడి చేసిన డ్రోన్ ఇరాన్ నుంచి వచ్చిందని అమెరికా రక్షణశాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ ప్రటించడం సంచలనం రేపింది.
Here's News
More images of the damage caused by the suspected drone attack on the merchant ship MV Chem Pluto. An Indian Navy team is assessing the damage caused by the strike and also investigating how the attack was carried out in the Arabian Sea. Indian Navy warships will be further… pic.twitter.com/sjidfAPqPK
— ANI (@ANI) December 25, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)