Credits: Twitter/ANI

Newdelhi, Dec 12: ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే చేయగలరనే అపోహలున్న రంగాల్లో కూడా వాళ్లుసత్తా చాటుతున్నారు. దీంతో ఏటా మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ(Indian Navy).. మహిళా అభ్యర్థులకు(women Candidates) గుడ్‌న్యూస్‌ అందజేసింది. త్రివిధ దళాల్లో కమాండోస్ గా విధులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఈ క్యాటగిరీలో పనిచేసే వాళ్ళను ప్రత్యేక దళంగా గుర్తిస్తామని వెల్లడించారు. ‘నేవీలో పనిచేసే మహిళలు ఇకపై మెరైన్ కమాండోస్ (మార్కోస్) (Marcos) గా విధులు నిర్వహించవచ్చు. భారత్ సైనిక చరిత్రలోనే ఇది తొలిసారి. అయితే, ఈ క్యాటగిరీలో చేరడానికి నిర్ణీత అర్హతలు, శిక్షణలు పూర్తి చేయాల్సి ఉంటుంది’ అని ఆయన తెలిపారు. అగ్నివీర్ ద్వారా సర్వీసుల్లో చేరే వారికీ ఈ అవకాశం ఉండనున్నట్టు వివరించారు. ల్యాండ్, సముద్రం, గాలిలో లక్షిత టాస్క్ లు పూర్తి చేసేలా మార్కోస్ కి శిక్షణ ఇస్తారు. శత్రు యుద్ధ నౌకలపై కోవర్ట్ ఆపరేషన్లు తదితర సున్నిత టాస్క్ లను ఈ మార్కోస్ నిర్వహిస్తారు.

రేపు మరో అల్పపీడనం.. ఏపీలో నేడు కూడా వర్షాలు.. తెలంగాణలోనూ రెండు రోజులు మోస్తరు వర్షాలు

మరోవైపు, వచ్చే ఏడాది నుంచి నేవీలోని ప్రతి విభాగంలో మహిళలను రిక్రూట్ చేసుకోనున్నట్లు నేవీ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు నావల్ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇటీవల వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు నేవీ దాదాపు ఏడు నుంచి ఎనిమిది శాఖల్లో మాత్రమే మహిళలను రిక్రూట్ చేసుకుంటోంది. అయితే వచ్చే ఏడాది నుంచి అన్ని శాఖల్లో మహిళా అధికారులను నియమించుకోనుంది. డిసెంబర్ 4న జరిగిన నేవీ డే వేడుకల సందర్భంగా ఇండియన్ నేవీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకం కింద ఇండియన్ నేవీ మొదటి బ్యాచ్‌లో సుమారు 3,000 మంది అగ్నివీర్స్ ఎంపికైనట్లు చెప్పారు.

ఢిల్లీలో బీజేపీకి భారీ షాక్, ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్షుడి రాజీనామా, తదుపరి అధ్యక్షుడిపై కొనసాగుతున్న కసరత్తు

వీరిలో 341 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. ఇది ల్యాండ్‌మార్క్ ఈవెంట్ లాంటిదని, మహిళా నావికులు మొదటిసారిగా నావికాదళంలోకి ప్రవేశించారని పేర్కొన్నారు. గత 16-17 సంవత్సరాలుగా మహిళా అధకారులను చేర్చుకుంటున్నామని, అయితే మహిళా నావికులను చేర్చుకోవడం ఇదే మొదటిసారని అన్నారు. ఇప్పటి వరకు కేవలం ఏడు నుంచి ఎనిమిది శాఖలకు మాత్రమే మహిళా అధికారులను పరిమితం చేశామని, ఇకపై వచ్చే ఏడాది నుంచి అన్ని శాఖల్లో మహిళా అధికారులను నియమించుకుంటామని హరికుమార్ స్పష్టం చేశారు.