Indian Rupee (Image used for representational purpose. (Photo Credit: Pixabay)

డాలర్ మారకంలో రూపాయి విలువ పతనమయింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్ల నుంచి వరుసగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం.. ఇండియా రూపాయి విలువను ప్రభావితం చేస్తోంది. అమెరికా డాలరుతో పోలిస్తే 52 పైసల (Indian Rupee Slumps 52 Paise ) మేర తగ్గి ప్రస్తుతం 77.42 వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం 55 పైసల మేర పతనమైన రూపాయి విలువ సోమవారం (మే 9) మార్కెట్స్ ఆరంభంలోనే మరింత క్షీణించింది. 77.17 వద్ద ప్రారంభమై 77.42కి (All-Time Low of 77.42 Against US Dollar ) పడిపోయింది. కాగా విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల నుంచి ఈ ఏడాది 17.7 బిలియన్ డాలర్లను (సుమారు రూ.7,500 కోట్లు) వెనక్కి తీసుకున్నారు.

గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు, భారత ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, ఆర్బీఐ రెపో రేటును పెంచడం తదితర కారణాలు రూపాయి పతనానికి కారణంగా కనిపిస్తున్నాయి. షాంఘై లాక్‌డౌన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా మార్కెట్లపై గట్టిగానే ప్రభావం చూపాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ విషయానికొస్తే... 30-షేర్ సెన్సెక్స్ 737 పాయింట్లు పడిపోయింది. అంటే.. 1.34 శాతం మేర క్షీణించి ప్రస్తుతం 54,098.58 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

దేశంలో గత 24 గంటల్లో 3207 కరోనా కేసులు, మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌ 

ఎన్‌ఎస్‌ఈ, నిఫ్టీ 220.25 పాయింట్ల మేర పడిపోయింది. 1.34 శాతం మేర క్షీణించి 16,191.00 పాయింట్లకు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.14 శాతం పెరిగి 112.55 డాలర్లకు చేరుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్‌లో రూ. 5,517.08 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు.

ఇదిలా ఉంటే విదేశీ పెట్టుబడిదారులు ఇంతపెద్దమొత్తంలో పెట్టుబడులను తీసుకోవడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. పెట్టుబడులు వెనక్కి తీసుకోవడానికి ప్రధాన కారణం.. ఆర్బీఐ తో పాటు అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను పెంచడమేనని తెలుస్తోంది. ఈక్విటీల నుంచి వెనక్కితీసుకున్న పెట్టుబడులను డెట్ వైపు మళ్లిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కమోడిటీల ధరలు, ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకోవడం వంటివి కూడా రూపాయి పతనానికి కారణాలుగా తెలుస్తోంది. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల కరెంటు ఖాతా లోటు విస్తరించడం, ఆర్బీఐ 0.40 శాతం మేర రెపో రేను పెంచడం కూడా రూపాయిపై ప్రభావం చూపించే అంశాలే.