Upper Siang January 20:  చైనా ఆర్మీ హద్దులు దాటింది. భారత్‌లోకి అక్రమంగా చొరబడి అరుణాచల్ ప్రదేశ్‌(Arunachal pradesh) కు చెందిన ఓ యువకుడ్ని అపహరించింది. అప్పర్ సియాంగ్ (Upper Siang)జిల్లాలోకి చొరబడ్డ చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ( People's Liberation Army) 17 ఏళ్ల మిరామ్ తరుణ్(Miram Taron) అనే యువకుడ్నికిడ్నాప్ చేసింది. ఈ మేరకు ఎంపీ తపీర్ గవో (MP Tapir Gao) ట్వీట్ చేశారు.

తరుణ్ (tarun) స్నేహితుడిని కూడా పీఎల్‌ఏ(PLA) కిడ్నాప్ చేయాలని భావించినప్పటికీ, కుదురలేదు. వారి నుంచి అతను తప్పించుకున్నాడు. తరుణ్ కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఈ ఘటనపై తగిన చర్యలను తీసుకోవాలని ప్రధాని మోడీ (MODI), రక్షణమంత్రి రాజ్‌నాథ్(Rajnath singh), కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా( amith shah) లకు విజ్ఞప్తి చేశారు ఎంపీ తపీర్ గవో.

తరుణ్ కిడ్నాప్ వ్యవహారాన్ని స్థానిక నేతలు కూడా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. చైనా ఆర్మీ దుశ్చర్యపై కేంద్రం వెంటనే స్పందించాలన్నారు. తరుణ్ ను విడిపించాలని కోరారు. చైనా ఆర్మీ ఇలా భారత్‌లోకి చొరబడి...కిడ్నాప్‌నకు పాల్పడంతో సరిహద్దులో సైన్యం అప్రమత్తమైంది. ఈ ఘటనపై రక్షణశాఖ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.