Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

New Delhi November 07:  భారత్‌లో కరోనా కేసుల తీవ్రత క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా రెండోరోజు కూడా రోజువారీ కేసులు 11వేలకు దిగువనే నమోదయ్యాయి. పలు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో వాటి సంఖ్య రికార్డుల్లో ఎక్కువగా ఉంటోంది.

శనివారం దేశవ్యాప్తంగా కరోనాతో 526 మంది మరణించారు. శనివారం 9,19,996 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,853 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 526 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 4,60,791కి చేరింది.

కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరట కలిగిస్తోంది. నిన్న 12,432 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.37 కోట్లు దాటింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,44,845 కి తగ్గింది. దీంతో ఇది 260 రోజుల కనిష్ఠానికి చేరింది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కాస్త నెమ్మదిగా సాగుతోంది. నిన్న 28,40,174 మందికి వ్యాక్సిన్లు అందించారు.