Nafe Singh Rathee (Photo Credit: File Image)

New Delhi, FEB 25:  ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) పార్టీకి చెందిన హర్యానా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీ (Nafe Singh Rathee) కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బులెట్ల గాయాలైన ఆయన అక్కడికక్కడే మరణించారు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. బహదూర్‌గఢ్‌లోని బరాహి గేట్ సమీపంలో హ్యుందాయ్ ఐ10లో ఉన్న షూటర్లు నఫే సింగ్ ప్రయాణిస్తున్న కారుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి (Shot Dead) పారిపోయారు. ఈ కాల్పుల్లో నఫే సింగ్‌తోపాటు ఆ కారులో ఉన్న మరో ఇద్దరు పార్టీ నేతలు మరణించారు. ముగ్గురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కాల్పుల సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 

నఫే సింగ్‌ కారుకు అనేక బుల్లెట్ల రంధ్రాలు ఉండటాన్ని పరిశీలించారు. హంతకులను అరెస్ట్‌ చేసేందుకు పోలీస్‌ బృందాలు ప్రయత్నిస్తున్నాయని పోలీస్‌ అధికారి తెలిపారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.