![](https://test1.latestly.com/wp-content/uploads/2020/02/Narendra-Modi-1-380x214.jpg)
New Delhi, Febuary 23: సుప్రీంకోర్టు (Supreme Court) వివిధాంశాలపై ఇస్తున్న తీర్పులను 130 కోట్ల మంది ప్రజానీకం సహర్షంగా స్వాగతిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం ఇటీవల వెలువరించిన పలు క్లిష్టమైన తీర్పులను (Critical judicial judgments) వెల్లడించిందని వీటిని భారతీయులు మనస్ఫూర్తిగా స్వాగతించారని ప్రధాని తెలిపారు.‘న్యాయవ్యవస్థ- మారుతున్న ప్రపంచం’ పేరిట సుప్రీంకోర్టులో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సు (International Judicial Conference 2020) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు.
ఉద్రిక్తతల వేళ పాక్ పర్యటనలో కాంగ్రెస్ నేత
ఈ సంధర్భంగా అయోధ్య సహా కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను ఉద్దేశించి ఆయన ఈ మాటను అన్నారు. మారుతున్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ- సవాళ్లు అనే అంశంపై ఆయన అంతర్జాతీయ న్యాయమూర్తుల సదస్సులో ప్రధాని (Prime Minister Narendra Modi) సుదీర్ఘంగా ప్రసంగించారు.
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ భారత్ బంద్
న్యాయవ్యవస్థ అనేక గట్టి సవాళ్లనే ఎదుర్కొంటోందని, అయినా అనేక సంక్లిష్ట తీర్పులు వచ్చాయి. వాటిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న భయసందేహాలు ఆ తీర్పులు రావడానికి ముందు అనేక వర్గాల్లో నెలకొన్నాయి. ఇపుడు చూడండి... కోట్లాది భారతీయులు వాటికి మద్దతు పలుకుతున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.
పుల్వామా దాడి అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత పాటిస్తూ న్యాయవ్యవస్థ పర్యావరణ ధర్మశాస్త్రాన్ని పునర్‌నిర్వచించిందని ప్రశంసించారు. మానవ మేధస్సుకు కృత్రిమ మేధను జోడించడం ద్వారా సత్వర న్యాయం అందించవచ్చన్నారు. డేటా భద్రత, సైబర్ నేరాలు న్యాయవ్యవస్థకు సరికొత్త సవాళ్లను విసురుతున్నాయని చెప్పారు. లింగ సమానత్వం లేనిదే ప్రపంచంలోని ఏ దేశం సమగ్ర అభివృద్ధిని సాధించలేదని ప్రధాని చెప్పారు.
తమ ప్రభుత్వం తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం, ట్రాన్స్‌జెండర్, దివ్యాంగుల హక్కుల చట్టాలను ఆయన ప్రస్తావించారు. మిలిటరీ సర్వీసుల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. సత్యం, సేవకే గాంధీజీ జీవితాన్ని అంకితం చేశారని, ఆయన చూపిన మార్గమే న్యాయవ్యవస్థకు పునాది అన్నారు.
రామజన్మభూమిలో ఎలాంటి సమాధులు లేవు
సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఆధునిక రాజ్యాంగాలలో చట్టబద్ధపాలన అన్నది ప్రాథమిక విషయమని, అయితే సవాళ్లకు ఆయా న్యాయవ్యవస్థలు స్పందించే తీరుపై దాని విజయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. పౌరులు తమ ప్రాథమిక విధులను తప్పక నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. భారత్‌కు 2000 ఏండ్ల న్యాయ చరిత్ర ఉన్నదని పేర్కొన్న ఆయన.. వ్యాసస్మృతి గురించి ప్రస్తావించారు.
అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా రామమందిరం
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు, అవినీతిపరులకు గోప్యత హక్కు ఉండదని, అలాంటి వ్యక్తులు వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని అనుమతించబోమన్నారు. ఇది సమాచార యుగం. మనిషి సృష్టించిన అద్భుతాల్లో ఇంటర్నెట్ ఒకటి. ఇది ఇపుడు దుర్వినియోగమవుతోంది.
ఉగ్రవాదులు, అవినీతిపరులు దీన్ని స్వార్థానికి వాడుతున్నారు. వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కుల్లో ఒకటి. ఆర్టికల్ 21 నుంచి అంటే జీవించే, గౌరవంగా బతికే హక్కు నుంచి వచ్చినది. ఈ హక్కు దుర్వినియోగమైతే ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
అయోధ్యలో రామమందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ఉగ్రవాదం, సైబర్ నేరాలు, పర్యావరణ క్షీణత, ఆరోగ్య సమస్యలు నేడు ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్నాయని, వీటిపై న్యాయవ్యవస్థ తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. మన తీర్పులపై ప్రపంచ దేశాల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు.ఈ నేలపై శాంతి కావాలంటే మనం కులం, వర్గం, జాతి, సరిహద్దులకు అతీతంగా వ్యవహరించాలి.
మనకు ఒక ప్రపంచ దృక్పథాన్ని ఏర్పర్చుకోవాల్సి ఉంది’ అని ఆయన మార్టిన్ లూథర్ కింగ్ వ్యాఖ్యలను ఉటంకించారు. భారత సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులను ఆస్ట్రేలియా, బ్రిటన్ , సింగపూర్ సహా అనేక దేశాల్లో అనుసరిస్తున్నారని ఆయన చెప్పారు.