CARTOSAT-3 Earth Imaging Satellite Launched by ISRO. |(Photo Credits: ISRO)

Sriharikota, June 30: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధంచేసింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు PSLV C-53 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది. అయితే ముందుగా నిర్ణయించిన సమయానికి రెండు నిమిషాలు ఆలస్యంగా రాకెట్‌ను ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లాలోని షార్‌ (SHAR)రెండో వేదిక నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహకనౌక సింగపూర్‌ (Singpore), కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫొటోలను తీసి పంపేలా వీటిని రూపొందించారు. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను (Countdown) శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఇది నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగనుంది. కౌంట్‌డౌన్‌ ముగిసిన అనంతరం.. గురువారం సాయంత్రం 6 గంటల 02 నిమిషాలకు పీఎస్ఎల్వీ(PSLV) వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.

పీఎస్‌ఎల్‌వీ సీ-53 (PSLV C-53) వాహక నౌక మూడు ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనున్నది. ఒకటి డీఎస్‌-ఈఓ (DS-EO). దీని బరువు 365 కిలోలు. మరో ఉపగ్రహం సింగపూర్‌కు చెందిన న్యూసార్ ‘NeuSAR). దీని బరువు 155 కిలోలు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని స్టారెక్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. మూడో ఉపగ్రహం స్కూబ్‌-I (SCOOB-I). నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU) రూపొందించింది. దీని బరువు కేవలం 2.8 కిలోలే. DS-EO ఉపగ్రహం 0.5 రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Maharashtra Political Crisis: అందరికీ థ్యాంక్స్ చెప్పి రాజీనామా చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, బల పరీక్షకు ముందే వెనకడుగు వేసిన ఠాక్రే.... 

సింగపూర్‌కు చెందిన న్యూసార్ ఉపగ్రహం సార్‌ పేలోడ్‌ను మోసుకెళ్లే మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం. ఈ ఉపగ్రహం పగలు, రాత్రి, అన్ని వాతావరణ పరిస్థితుల్లో చిత్రాలను అందించనున్నది. మూడో ఉపగ్రహం SCOOB-I స్టూడెంట్ శాటిలైట్ సిరీస్ (S3-I). సింగపూర్‌లోని ఎన్‌టీయూ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లోని శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థులు రూపొందించారు.

Vice President Election 2022: ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల, ఆగ‌స్టు 6వ తేదీన పోలింగ్, జులై 19 వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు 

పీఎస్‌ఎల్‌వీ 55వ మిషన్‌ ఇది. పీఎస్‌ఎల్‌వీ-కోర్ అలోన్ వేరియంట్‌ను ఉపయోగించి చేస్తున్న 15వ మిషన్‌గా ఇస్రో అధికారులు తెలిపారు. ఇంకా షార్‌లోని రెండో లాంచ్‌ ప్యాడ్‌ నుంచి ప్రయోగిస్తున్న 16వ పీఎస్ఎల్వీ రాకెట్ ఇది. ప్రయోగం నాలుగు దశల్లో జరుగనున్నది. 44.4 మీటర్ల పొడవు గల PSLV-C53 వాహక నౌక. DS-EO ఉపగ్రహాన్ని 570 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నది. ఆ తర్వాత మిగతా ఉపగ్రహాలను కూడా కక్ష్యల్లో ప్రవేశపెడుతుంది.