ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైంది. జులై 5వ తేదీన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ వెలువ‌డనుంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 6వ తేదీన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు ఫ‌లితాల‌ను కూడా వెల్ల‌డించ‌నున్నారు. జులై 19 వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు విధించారు. 20 నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు జులై 22 తుది గ‌డువు. ప్ర‌స్తుతం ఉప రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య‌నాయుడు కొన‌సాగుతోన్న విష‌యం విదిత‌మే. వెంకయ్యనాయుడు 2017 ఆగస్టు 11వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)