టీ10 మ్యాచుల్లో ప‌సికూన ఆస్ట్రియా (Austria) జ‌ట్టు సంచలన రికార్డుతో మెరిసింది. రొమేనియా (Romania)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రి రెండు ఓవ‌ర్లలో 61 ర‌న్స్ బాదేసి క్రికెట్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. రొమేనియా నిర్దేశించిన 168 ప‌రుగుల ఛేద‌న‌లో ఆస్ట్రియా బ్యాట‌ర్లు త‌డాఖా చూపించారు. ల‌క్ష్య ఛేద‌న‌లో 8 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రియా స్కోర్.. 107/3. మ్యాచ్ గెల‌వాలంటే రెండు ఓవ‌ర్ల‌లో 61 ప‌రుగులు కావాలి.

ఆ ద‌శ‌లో కెప్టెన్ అకీబ్ ఇక్బాల్(72 నాటౌట్) గేర్ మార్చాడు. రొమేనియా బౌల‌ర్ మ‌న్మీత్ కొలిను ఉతికేస్తూ వ‌రుస‌గా 6, 4, 6, 6 బాదాడు. ఇక్బాల్ విధ్వంసానికి జ‌డిన కొలి ఐదు వైడ్స్‌, నో బాల్ కూడా వేయ‌డంతో ఆ ఓవ‌ర్‌లో ఏకంగా 41 ర‌న్స్ వ‌చ్చాయి. ఇక 10వ ఓవ‌ర్లో సైతం ఇక్బాల్ హ్యాట్రిక్ సిక్స‌ర్లు బాదేశాడు. దాంతో, ఆస్ట్రియా చారిత్రాత్మ‌క విజ‌యాన్ని న‌మోదు చేసింది.  ఒక బాల్‌కి 13 పరుగులు, ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)