యురోపియ‌న్ దేశం ఆస్ట్రియాలో మ‌ళ్లీ క‌రోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ దేశంలో మ‌రోసారి లాక్‌డౌన్ (Lockdown in Austria) అమ‌లు చేయ‌నున్నారు. సోమ‌వారం నుంచి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమ‌లులోకి రానున్న‌ది. ప్ర‌స్తుతం వ్యాక్సిన్ వేసుకోని వారికి లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే కేసులు తగ్గకపోవడంతో క‌నీసం ప‌ది రోజులైన సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుంద‌ని ఆస్ట్రియా ఛాన్స‌ల‌ర్ అలెగ్జాండ‌ర్ ష‌ల్క‌న్‌బ‌ర్గ్ తెలిపారు.

క‌రోనా పాజిటివ కేసులు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయ‌ని, మ‌రో వైపు వ్యాక్సినేష‌న్ త‌క్కువ స్థాయిలో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆస్ట్రియా త‌ర‌హాలోనే ఇత‌ర యురోపియ‌న్ దేశాలు కూడా లాక్‌డౌన్ అమ‌లు చేసే ఆలోచ‌న‌లో ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకోని వారి కోసం స్లోవేకియా ప్ర‌ధాని ఇడార్డ్ హేగ‌ర్ కూడా సోమ‌వారం నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. టీకాలు తీసుకోని వారు ఉన్న ప్ర‌దేశాల్లో ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసేందుకు జ‌ర్మ‌నీ కూడా సిద్ధ‌మైంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)