Ajit Pawar: అజిత్ పవార్‌కు ఐటీ షాక్, రూ.1000 కోట్ల విలువైన ఆస్తుల జప్తు, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
Ajit Pawar (Photo Credits: PTI)

Mumbai, November 2: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబానికి చెందిన రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను (IT Department Attaches Properties Worth Rs 1,000 Crore ) ఐటీ శాఖ జప్తు చేసింది. తాజాగా జప్తు చేసిన ఆస్తుల్లో ఒక్క జరందేశ్వర్ కోఆపరేటివ్ చక్కెర కర్మాగారం విలువే రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. ఇది సతారాలో ఉంది.

ఇది కాకుండా అజిత్ పవార్ (Ajit Pawar) కుమారుడు పార్థ్ పవార్ కు చెందిన కార్యాలయం (రూ.25 కోట్లు), సౌత్ ఢిల్లీలో ఓ ఖరీదైన ఫ్లాట్ (రూ.20 కోట్లు), ముంబయి నారిమన్ పాయింట్ లోని నిర్మల్ టవర్ తో పాటు గోవాలోని ఓ రిసార్టు సహా పలు ఆస్తులను ఐటీ అధికారులు జప్తు చేశారు. మొత్తంగా ఢిల్లీ, మహారాష్ట్ర, గోవాలలో ఈ ఆస్తులు ఉన్నాయని తెలిపారు.

అక్టోబరులో అజిత్ పవార్ తోబుట్టువులు, సన్నిహితుల ఇళ్లు, సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయగా... కేంద్రం కావాలనే తమపై దాడులు చేయిస్తోందని అజిత్ పవార్ ఆరోపించారు. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.184 కోట్ల ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ అధికారులు తెలిపారు.

దేశంలో కొత్త‌గా 10,423 క‌రోనా కేసులు, గత 24 గంటల్లో 443 మంది క‌రోనా వ‌ల్ల మృతి

తాము పన్నులు సక్రమంగానే చెల్లిస్తున్నామని అన్నారు. తాను ఆర్థిక మంత్రినైనందున తనకు ఆర్థిక క్రమశిక్షణ బాగా తెలుసునన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తన సోదరీమణులకు సుమారు 35 సంవత్సరాల క్రితం వివాహమైందని, వారి ఇళ్ళు, సంస్థలపై కూడా సోదాలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు.

తాజా ఐటీ దాడులపై బీజేపీ నేత కిరీట్ సోమయ్య స్పందిస్తూ, జప్తు చేసిన ఆస్తులు అజిత్ పవార్ కుమారుడు, భార్య, తల్లి, సోదరి, అల్లుడి పేరు మీద ఉన్నాయని వివరించారు.