Ram Nath Kovind (Photo-IANS)

New Delhi, SEP 24: జమిలి ఎన్నికల (jamili elections) సాధ్యాసాధ్యాల పరిశీలిన కమిటీ తొలి సమావేశం ముగిసింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ramnath Kovind) నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. శనివారం ఈ కమిటీ ఢిల్లీలో (Delhi)  తొలిసారి సమావేశం అయింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ సభ్యులు చర్చించారు.

Sharad Pawar Visits Adani Office: అదానీ ఇంటికి శరద్‌ పవార్‌, ఫ్యాక్టరీని ప్రారంభించిన ఇద్దరు నేతలు, ఆసక్తికరంగా మారిన ఇరువురి భేటీ 

ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అమిత్ షా (Amith shah), అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. జమిలి ఎన్నికలపై వాటాదారులు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏదైనా రాజకీయ పార్టీ కమిటీని కలిసి సూచనలు ఇవ్వవచ్చు అన్నారు. భారత ఎన్నికల సంఘం, న్యాయ కమిషన్ సహా ఇతర సంస్థల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు చర్చలు జరపాలని నిర్ణయించారు.