అమర్‌నాథ్ యాత్రికులు, ఇతర పర్యాటకులు తక్షణమే తమ పర్యటన ముగించుకొని కాశ్మీరు లోయను వదిలి వెళ్లాలని రాష్ట్ర పాలన మరియు అడ్వైజరీ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
భారత రక్షణ శాఖ, మరియు కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అమర్‌నాథ్ దారిలో ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రమూకలు అక్రమంగా చొరబడినట్లు తమకు నిఘావర్గాల నుంచి ఖచ్చితమైన సమాచారం అందిదని వెల్లడించారు. అలా చెప్పిన కొద్ది సేపటికే రాష్ట్ర పరిపాలన విభాగం అమర్ నాథ్ యాత్రను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
https://twitter.com/ANI/status/1157235503256805378
గత వారం జూలై 25న, 10 వేల బలగాలను తరలించిన కేంద్రం ఇప్పుడు అదనంగా మరో 25 వేల బలగాలను తరలించడంతో ఏం జరగబోతుందోనని అక్కడి ప్రజల్లో టెన్షన్ వాతావారణం నెలకొంది. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35-A రద్దు చేస్తున్నారనే ప్రచారాల నడుము మోడీ సర్కార్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం జమ్మూ- కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. నవంబర్ 22, 2018లో ప్రభుత్వాన్ని రద్దుచేసిన గవర్నర్, రాష్ట్రపతి పాలనను విధించారు. అప్పట్నించీ కాశ్మీర్ లోని పరిస్థితులను కేంద్రం నేరుగా పర్యవేక్షిస్తుంది.
కాగా, ఓ రక్షణ శాఖ అధికారి ఆర్టికల్ 35-A రద్దు విషయంపై స్పందిస్తూ, అలాంటి సమాచారం తమకేది లేదని. అయితే ఆగష్టు 15, భారత స్వాతంత్ర దినోత్సవాల సంబరాలను లక్ష్యంగా చేసుకొని అమర్ నాథ్ యాత్రలో భారీ విస్పోటనానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని. కాశ్మీర్ లో చొరబడిన ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశారం. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు ఏ రకంగా భారత్ లోకి ప్రవేశించకుండా పటిష్ఠమైన చర్యలు తెస్కుంటున్నట్లు వెల్లడించారు.