Road Accident (Representational Image)

Gumla, May 3: జార్ఖండ్‌లోని (Jharkhand) గుమ్లాలో (Gumla) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెండ్లికి వెళ్లి (Wedding ceremony) తిరిగివస్తున్న ఓ పికప్‌ వ్యాన్‌ (Pickup Van) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికు తరలించారు.

వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో సుమారు 50 మంది ఉన్నారని చెప్పారు. దుమ్రిలోని సరాన్‌దిహ్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. జార్దా గ్రామ సమీపంలో అదుపుతప్పిన వ్యాన్‌.. బోల్తా పడిందని, మూడుసార్లు పల్తీలు కొట్టడంతో ఐదుగురు మృతిచెందారని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో బహుదా నదిపై కుప్పకూలిన పాత వంతెన, 70 టన్నుల రాయి లోడ్‌తో లారీ బ్రిడ్జిపై వెళ్తుండగా కూలిన వంతెన

గుమ్లా జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న జర్దా గ్రామం సమీపంలో 55 మంది వ్యక్తులతో ఒక వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న పికప్ వ్యాన్ రోడ్డుపైకి రాకముందే కనీసం మూడుసార్లు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వధువు తల్లి లుందారీ దేవి (45), తండ్రి సుందర్ గయార్ (50) గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు పులికర్ కుండో (50), సవితా దేవి, అల్సౌ నగేసియాగా గుర్తించారు.గాయపడిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు.