
Koderma, July18: జార్ఖండ్ రాష్ట్రంలో విషాద ఘటన (Jharkhand Boat Tragedy) చోటు చేసుకుంది. భారీ వర్షాల వేళ Panchkhero డ్యామ్‌లో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది (Eight of family drown) మరణించారు. కోడ్మెరా జిల్లాలో రాజ్‌ధన్‌వార్ ప్రాంతానికి చెందిన సీతారాం యాదవ్ కుటుంబం ఆదివారం సెలవు రోజు కావడంలో ఎంజాయ్‌మెంట్ కోసం పంచఖేరో డ్యామ్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో వారంతా ఓ పడవలో డ్యామ్ చూసేందుకు వెళ్లారు. ఇంతలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా (boat capsizes in Jharkhand) పడింది.
దీంతో, పడవలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది నీటిలో మునిగిపోయి అకాల మరణం చెందారు. మరణించిన వారిని సీతారాం యాదవ్ (40), శివమ్ సింగ్ (17), రాహుల్ కుమార్ (16), అమిత్ కుమార్ (14), సెజల్ కుమారి (16), పాలక్ కుమారి (14),హర్షల్ కుమార్ (8), భావ (5)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్, పడవ నడిపే వ్యక్తి మాత్రమే ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు.
పడవ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందంలో రంగంలోకి దిగి డ్యామ్‌లో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, ఇప్పటి వరకు వారి డెడ్‌బాడీలు మాత్రం బయటకు తీసుకురాలేదు. ఈ సమాచారం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు డ్యామ్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.