July Calendar 2022 (Photo Credits: File Image)

ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికి బ్యాంక్ లావాదేవీలు జ‌రుప‌డం నిత్యావ‌స‌రాల్లో ఒక భాగం. అయితే, బ్యాంకును సంప్ర‌దించాలంటే సంబంధిత శాఖ‌కు వెళ్ల‌డానికి ముందే బ్యాంకుల‌కు సెలవులు ఉన్నాయా.. లేదా.. అన్న సంగ‌తి చెక్ చేసుకోవ‌డం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జూలై -2022 సెలవుల జాబితాను (Bank Holidays in July 2022) విడుదల చేసింది. దీని ప్రకారం జూలై నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఇవి మొత్తం దేశంలో ఒకే రోజు సెలవులు కావు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పండుగల ప్రకారం ఈ సెలవుల జాబితాను ఆర్ బీఐ జారీ చేస్తుంది. దీని ప్రకారం.. జూలై నెలలో 14 రోజులు బ్యాంకులు (Bank Holidays in July) పనిచేయవు. ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయకుంటే రూ. 1000 ఫైన్, పాన్ కార్డు బ్లాక్, మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.10వేల వరకు జరిమానా, వెంటనే ఈ వివరాల ద్వారా ప్రాసెస్ పూర్తి చేయండి

నెలలో రెండు శనివారాలు, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈనెలలో మొత్తం ఐదు ఆదివారాలు వచ్చాయి. రెండు శనివారాలతో కలిపితే సాధారణ సెలవులు ఏడు ఉన్నాయి. బక్రీద్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శని, ఆదివారాలు మినహా బ్యాంకులు కిటకిటలాడుతుంటాయి. పలువురు బ్యాంకులు మూసిఉన్న తేదీలు తెలియ బ్యాంకుల వద్దకు వచ్చి వెనుదిరిగి పోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో బ్యాంకులకు జూలై నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నాయనే వివరాలు తెలుసుకుంటే మందుగానే బ్యాంకు పనులకు ప్లాన్ చేసుకోవచ్చు.

జూలై 2022లో బ్యాంకు సెలవుల జాబితా :

1) శుక్రవారం, జూలై 1- రథ యాత్ర (ఒడిశా)

2) ఆదివారం, జూలై 3 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

3) మంగళవారం, జూలై 5- గురు హరగోవింద్ జయంతి (జమ్మూ & కాశ్మీర్)

4) బుధవారం, జూలై 6- MHIP డే (మిజోరం)

5) గురువారం, జూలై 7- ఖర్చీ పూజ (త్రిపుర)

6) శనివారం, జూలై 9- ఈద్-ఉల్-అద్హా (బక్రీద్)/ రెండవ శనివారం

7) ఆదివారం, జూలై 10- అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

8) సోమవారం, జూలై 11- ఈద్-ఉల్-అజా

9) బుధవారం, జూలై 13- అమరవీరుల దినోత్సవం (జమ్మూ కాశ్మీర్)

10) బుధవారం, జూలై 13- భాను జయంతి (సిక్కిం)

11) గురువారం, జూలై 14- బెన్ డియెంక్లామ్ (మేఘాలయ)

12) శనివారం, జూలై 16- హరేలా (ఉత్తరాఖండ్)

13) ఆదివారం, జూలై 17- అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

14) శనివారం, జూలై 23- నాల్గవ శనివారం

15) ఆదివారం, జూలై 24 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే

16) మంగళవారం, జూలై 26- కేర్ పూజ (త్రిపుర)

17) ఆదివారం, జూలై 31 - అన్ని బ్యాంకులకు కామన్ హాలీడే