Kailash Mansarovar Yatra Travel (Photo-Twitter RMO India)

New Delhi, May 8: కైలాస పర్వతంలో కొలువైన మానస సరోవరానికి (Kailash Mansarovar Yatra) అతి త్వరగా చేరుకోవాలనే భక్తుల కల నేరవేరింది. కైలాస మానసరోవర యాత్రలో నవ శకం ప్రారంభమైంది. టిబెట్‌లోని కైలాస మాన‌స‌స‌రోవ‌రానికి చేరుకునేందుకు (Kailash Mansarovar Yatra Travel) ఇవాళ కొత్త మార్గాన్ని ప్రారంభించారు. టిబెట్‌, ఉత్త‌రాఖండ్ స‌రిహ‌ద్ద మార్గంలో లిపులేక్ నుంచి ఈ రూటును వేశారు. కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో కైలాస మానసరోవర యాత్రా సమయం భారీగా తగ్గనుంది. ముంబైలో మే నెలంతా లాక్‌డౌన్ తప్పదా?, మహారాష్ట్రలో 557 మంది పోలీసులకు కరోనా, 18వేలు దాటిన కోవిడ్-19 కేసులు, వెల్లడించిన రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌

80 కిలోమీట‌ర్ల ఆ మార్గాన్ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) ఇవాళ ఓపెన్ చేశారు. అయితే ఈ రూటులో వెళ్తే లిపుకేక్ పాస్ నుంచి కైలాస మాన‌స స‌రోవ‌రం సుమారు 90 కిలోమీట‌ర్లు ఉంటుంది. పితోరగర్‌ నుంచి గంజికి(నూతనంగా నిర్మించిన మార్గం గుండా) వెళ్లే తొమ్మిది వాహనాల కాన్వాయ్‌ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర మంత్రి పచ్చ జెండా ఊపి పంపారు.ఈ కార్యక్రమంలో ఛీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఛీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నార్వానే పాల్గొన్నారు. ఈ రూటులో వెళ్లే యాత్రికులు కేవ‌లం వారం రోజుల్లోనే త‌మ ప్ర‌యాణాన్ని ముగించుకుంటార‌న్నారు. ఇత‌ర పాత రూట్ల‌లో మాన‌స స‌రోవ‌రానికి వెళ్లేందుకు క‌నీసం మూడు వారాల స‌మ‌యం ప‌ట్టేది.

Here's / RMO India Tweet

ఉత్త‌రాఖండ్‌లోని ఘ‌టియాబాగ‌ర్ నుంచి టిబెట్‌లోని లిపులేక్ పాస్ (Lipulekh pass) వ‌ర‌కు కొత్త రోడ్డు మార్గం వేశారు. ఈ రోడ్డుతో ద‌శాబ్ధాల క‌లం నిజ‌మైంద‌ని, స్థానికులు, భ‌క్తుల ఆంకాక్ష‌లు నెర‌వేరిన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఈ రోడ్డు మార్గం వ‌ల్ల వాణిజ్యం కూడా పెరుగుతుంద‌న్నారు. చైనా సరిహద్దుకు ద‌ళాల త‌ర‌లింపుంలోనూ ఈ ప్రాంతం వ్యూహాత్మ‌కంగా ప‌నిచేస్తుంద‌ని మిలిట‌రీ అధికారులు చెప్పారు.

కాగా ఇప్పటి వరకు సిక్కిం, నేపాల్ మార్గాల్లో లిపులేక్ పాస్ వరకు వెళ్లేవారు. అక్కడి నుంచి మానస సరోవర్ చేరుకునేవారు. ఐతే ఇకపై ఉత్తరాఖండ్‌లోని పిత్తోర్‌గఢ్ నుంచి దార్చుల్లా, గూంజీ మీదుగా నేరుగా లిపులేక్ పాస్ వరకు ప్రయాణించవచ్చు. కైలాస మానససరోవర్ యాత్రకు లిపులేక్‌ను గేట్‌ వేగా పిలుస్తారు. అక్కడి నుంచి 80 కి.మీ. ప్రయానిస్తే కైలాస మాససరోవరం వస్తుంది.ఈ కొత్త మార్గం అందుబాటులోకి భక్తుల కష్టాలు తీరుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అలాగే పర్వత ప్రాంతాల్లో రవాణా పెరిగి.. వాణిజ్యం కూడా అభివృద్ధి చెందుతుదని వెల్లడించారు.