Karnataka Assembly bypolls ec-announces-schedule-for-15-karnataka-assembly-bypolls-voting-on-dec-5th-results-on-9th-dec | Photo -PTI

Bengaluru, Novemebr10: కర్ణాటక(Karnataka )లో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. అక్కడ 15 అసెంబ్లీ స్థానాలకు(15 Assembly Constituencies)సంబంధించిన ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ స్థానాలకు డిసెంబర్‌ 5(December)న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9(December 9)న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న కారణంతో గత ప్రభుత్వంలో 15 మంది ఎమ్మెల్యేలపై (15 disqualified MLAs) స్పీకర్ రమేష్ కుమార్‌ వారిపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

15వ అసెంబ్లీ కాలం ముగిసేవరకు వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హులుగా ప్రకటించారు. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితంలేకపోయింది. దీంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలతో పాటే కర్ణాటక అసెంబ్లీలో 15 స్థానాల(15 Karnataka Assembly Constituencies)కు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాటిని వాయిదా వేసింది. అప్పుడు మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. అవన్నీ ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు.

అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేల కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. స్పీకర్‌ నిర్ణయాన్ని కోర్టు కొట్టివేస్తుందా? లేక సమర్థిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అయితే మరో రెండు రోజుల్లోనే దీనిపై న్యాయస్థానం తీర్పును వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఉప ఎన్నికల ప్రకటనతో కన్నడనాట రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలు జరిగే స్థానాల్లో గెలుపు అధికార బీజేపీకి సవాలుగా మారింది. ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని యడ్డ్యూరప్ప సర్కార్‌ భావిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.