Bengaluru, NOV 02: నా భార్య నన్ను కొడుతుంది సార్.. నన్ను కాపాడండీ అంటూ ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికే (PMO Office) ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. యదునందన్ ఆచార్య అనే వ్యక్తి సోషల్ మీడియాలో (social media) చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌ గా మారింది. నా భార్య ప్రతిరోజు నన్ను కొడుతోందని, కత్తితో దాడి చేసిందంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. దాన్ని పీఎంవోతో పాటూ బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ (Bengaluru Police Commissioner), కేంద్ర న్యాయశాఖమంత్రి కిరెన్ రిజిజుకు ట్యాగ్ చేశాడు. నాకు ఎవరైన సాయం చేయగలరా? నేను మగాన్ని కాబట్టే నాకు ఎవరూ సాయం చేయడం లేదు, నా భార్య నన్ను రోజూ కొడుతోంది. దీనిపై నేను గృహహింస (domestic violence case) కేసు పెట్టొచ్చా? పెట్టలేను ఎందుకంటే నేను మగాన్ని కాబట్టి అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య చేతిలో గాయపడ్డ తన చేతికి సంబంధించిన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు.

అయితే ఈ పోస్టుకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి స్పందించారు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లండి అంటూ యదునందన్ ఆచార్యకు సలహా ఇచ్చారు. అయితే అతను చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. యదునందన్‌కు పలువురు సపోర్ట్ చేస్తున్నారు.

Delhi Fire: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, ఇద్దరు కార్మికులు మృతి, లోపల చిక్కుకున్న పలువురు కార్మికులు 

అతనిలా భార్యల చేతిలో గృహహింసకు గురవుతున్నవారు చాలా మంది ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు నీకు అండగా మేమున్నాం అంటూ భరోసా ఇస్తున్నారు. అయితే యదునందన్ పోస్టుపై మహిళలు కూడా స్పందిస్తున్నారు. హింస ఎవరి మీద జరిగినా కూడా ఆమోదం కాదని, దీన్ని తప్పకుండా ఖండించాల్సిందే అంటున్నారు.