Coronavirus Outbreak (Photo credits: IANS)

Bangalore January 23: కర్ణాటక (Karnataka) లో కరోనా (Corona) విశ్వరూపం చూపిస్తోంది. అక్కడ రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే కరోనా కేసులు 50వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 19 మంది మరణించారు. రికవరీలు(Recovery) మాత్రం కనీసం కొత్త కేసుల్లో సగం కూడా లేవు. డైలీ పాజటివిటీ రేటు (Daily positivity rate) కూడా కర్ణాటకలో భారీగా నమోదవుతోంది. అక్కడ ప్రస్తుతం 22.77 శాతం పాజిటివిటీ రేటు ఉంది. ఇక కరోనా యాక్టీవ్ కేసులు (Corona active cases) 3లక్షల 57వేల 796 ఉన్నాయి. భారత్‌లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో యాక్టీవ్ కేసులు లేవు.

ఇక బెంగళూరు (Bangalore)లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కర్ణాటకలో వచ్చిన కేసుల్లో సగానికి పైగా బెంగళూరు (Bangalore)లోనే వచ్చాయి. యాక్టీవ్ కేసుల్లోనూ బెంగళూరులో 2 లక్షల 31వేలకు పైగా ఉన్నట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ ప్రకటించింది.