
Bengaluru, April 6: కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కక్షతో యువతిని కత్తితో పొడిచి (stabbed) చంపాడు. తుమకూరు జిల్లాలోని శిరా తాలూకాలోని దొడ్డగుళలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. హతురాలు పొరుగు గ్రామమైన రత్నసంద్ర గొల్లరహట్టికి చెందిన పీయూసీ విద్యార్థిని కావ్య(20)గా గుర్తించారు. నిందితుడు ఈరణ్ణ (21) పరారీలో ఉన్నాడు.
కళ్లంబెళ్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఈరణ్ణ కాలేజీలో చదువుతున్న కావ్యను ప్రేమించాలంటూ వెంటపడేవాడు. ఆ యువతి నిన్ను ప్రేమించనని అనేకసార్లు తెగేసి చెప్పేసింది. అయినప్పటికీ ఆ యువకుడు (Karnataka Shocker) ఆమె వెంట పడుతూ ప్రేమించాలని వేధించేవాడు. ఆ యువతి ప్రేమించనని తెగేసి చెప్పడంతో యువతిపై పగను పెంచుకున్నాడు.
సోమవారం ఉదయం కావ్య కాలేజీకి వెళుతున్న సమయంలో అడ్డుకుని.. ‘‘నిన్ను ఎలాగైనా నా దానిని చేసుకుంటా’’ అని ఆమె మెడలొ తాళి కట్టబోయాడు. అయితే ఆ యువతి అడ్డుకోవడంతో కత్తి తీసి దాడికి యత్నించాడు. యువతి పారిపోతున్నా వెంటాడి కత్తితో పొడిచి చంపాడు. ఇది చూసిన సహచర విద్యార్థులు కావ్య కుటుంబ సభ్యులతో పాటు పొలీసులకు సమాచారం ఇచ్చారు. పొలీసులు యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఈరన్న పరారీలో ఉన్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.