Representational Image | (Photo Credits: IANS)

Mysore, July 4: కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ స్నానం చేస్తుండగా తండ్రీ కొడుకులు (Father And Son At Mysore) చాటుగా వీడియోలు తీసి తద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ దారుణాన్ని పసిగట్టిన బాధితురాలు తండ్రీ కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు (Woman's Complaint) చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెబ్బాలలో సదరు మహిళ ఇంటి పక్కన ఉండే ప్రమోద్, అతని తండ్రి గోవిందరాజు నిందితులుగా గుర్తించారు.

బాధితురాలి భర్త పనికి వెళ్ళిన సమయంలో ఇంటి ముందు బాత్‌రూంలో ఆ మహిళ స్నానం చేస్తున్న సమయంలో తండ్రీ కొడుకులిద్దరూ కలిసి గుట్టుగా మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. దానిని ఆమె మొబైల్‌ఫోన్‌కు పంపి రూంకి రావాలని లైంగికంగా వేధించడంతో పాటు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయసాగారు. దీంతో బాధితురాలు జరిగిన ఘటనను ఆమె భర్త హెబ్బాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

భార్య లేని సమయంలో కూతుర్లపై పోలీస్ అధికారి అత్యాచారం, అంతటితో ఆగకుండా మరదలిని గర్భవతి చేసిన కామాంధుడు, భర్త నేరాలపై సీబీఐ దర్యాప్తు కోరిన పోలీస్ భార్య

గత వారం కర్ణాటకలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. లక్ష రుణం చెల్లించనందుకు కొందరు వ్యక్తులు అక్కాచెల్లెళ్ల దుస్తులు ఊడదీసి వారిపై దాడి చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని అనేకల్ తాలూకా దొడ్డబొమ్మసంద్ర గ్రామానికి చెందిన ఒక మహిళ తన పిల్లల చదువు కోసం నెరిగ గ్రామానికి చెందిన రామకృష్ణా రెడ్డి నుంచి 30 శాతం వడ్డీకి రూ. లక్ష అప్పు తీసుకుంది. అయితే ఆ అప్పు మొత్తం చెల్లించాలని రామకృష్ణా రెడ్డి డిమాండ్‌ చేశాడు. దీంతో స్థలం అమ్మిన తర్వాత డబ్బులు చెల్లించేందుకు గ్రామస్తుల సమక్షంలో ఒప్పందం జరిగింది.

సునీల్‌ కుమార్‌, ఇంద్రమ్మతో కలిసి మంగళవారం ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. లక్ష అప్పు తీసుకున్న మహిళ, ఆమె సోదరి దుస్తులు ఊడదీసి వారిని కొట్టారు. కాగా, బాధిత మహిళలు సర్జాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే తొలుత కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. నిందితులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. మరోవైపు ముగ్గురు వ్యక్తులు కలిసి ఆ మహిళలను కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు స్పందించారు. మంగళవారం రాత్రి బాధిత మహిళలను పిలిపించి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం రామకృష్ణా రెడ్డి, సునీల్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. మరో వ్యక్తి ఇంద్రమ్మను అరెస్ట్‌ చేయాల్సి ఉంది.