Pic Source: Instagram

కేదార్‌నాథ్ : కేదార్‌నాథ్ ఆలయంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నోయిడాకు చెందిన త్యాగి అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను కేదార్‌నాథ్ ఆలయంలోకి తీసుకువెళ్లాడు. అతడు తన పెంపుడు కుక్కతో కలిసి ఆలయం వెలుపల ఉన్న నంది విగ్రహాన్ని తాకాడు. అంతటితో ఆగకుండా తన పెంపుడు కుక్కకు పూజారి తిలకం సైతం దిద్దాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనపై బద్రీనాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ సభ్యులు కుక్క యజమాని రోహన్ త్యాగిపై కేసులు కూడా పెట్టారు. ఇది కించపరిచే చర్యగా అభివర్ణించారు. ఇలాంటి వ్యక్తులు ఆలయానికి భక్తితో రారని ఆలయ కమిటీ సభ్యులు మండిపడుతున్నారు. ఆలయంలో భారీ సంఖ్యలో కమిటీ సిబ్బంది, పోలీసులు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడం విచారకరమంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు, సదరు వ్యక్తిపై చట్టపరమైన, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మే 17న బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌ ఓ లేఖను విడుదల చేశారు.

నిజానికి కేదార్ నాథ్ ఆలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాల్లో ఉంది. పాండవులు స్వర్గానికి వెళ్లాలని మహాప్రస్థాన యాత్ర చేపట్టగా, వారితో పాటు ఒక కుక్క కూడా ఉందని చెబుతారు. యుధిష్ఠిరుడు ఆ కుక్కను ఎంతగానో ప్రేమించి, తనతో పాటు స్వర్గానికి తీసుకెళ్లాలనే పట్టుదల కోరాడు. అలాంటి పాండవులు నిర్మించిన కేదార్‌నాథ్ ఆలయంలోనే కుక్క కనిపించడంపై దుమారం రేగడం అనవసరమైన రాద్ధాంతంగా చెబుతున్నారు. పరమశివుడు భూతనాథుడు, పశుపతి, ఆయన ప్రమధ గణాలలో ఒకడై శివుడి క్రోధాగ్ని నుంచి ఉద్భవించిన కాల భైరవుడి వాహనం కూడా శునకమే కావడం విశేషం.

అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తున్నాయి. కుక్క యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బద్రీ-కేదార్ ఆలయ కమిటీ డిమాండ్ చేసింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌ ఆదేశాల మేరకు కమిటీ సీఈవో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు.

ఈ ఘటనకు కారణమైన కుక్క పేరు నవాబ్, ఈ కుక్క నోయిడాలో నివసించే హిమ్షి త్యాగికి చెందినది. దీనిని లక్ష రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ వైరల్ వీడియోలో, కుక్కతో పాటు ఆమె భర్త రోహన్ త్యాగి ఉన్నారు. కేదార్‌నాథ్‌లో ప్రస్తుతం వైరల్‌గా ఉన్న వీడియోలోని కుక్క హస్కీ జాతికి చెందినదని హిమ్షి త్యాగి చెప్పారు. ఇది రష్యన్ కుక్కల జాతికి చెందినది. మేము దాన్ని మా స్వంత కొడుకులా పెంచుతామని, అతని పేరు 'నవాబ్ త్యాగి' అని హిమ్షి చెప్పాడు.

ప్రస్తుతం నవాబు వయస్సు నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు. 2018లో బెంగుళూరు నుంచి ఈ కుక్కను తీసుకొచ్చాడు. ఇందులో ఫ్లైట్ ఖర్చు, కుక్క ఖర్చుతో కలిపి మొత్తం లక్ష రూపాయలు ఖర్చయ్యాయి. ఆ సమయంలో నవాబు వయస్సు కేవలం 50 రోజులు మాత్రమే.

ఈ కుక్క ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్, పారాగ్లైడింగ్ కూడా చేసింది. కేదార్‌నాథ్ ఆలయ వీడియోకు ముందు కూడా నవాబ్ డాగ్ చర్చనీయాంశమైంది. టిక్‌టాక్‌లో ఈ కుక్క పేరిట వెరిఫైడ్ పేజీ ఉందని హిమ్షి చెప్పాడు. అదే సమయంలో, తన కుక్క పేరిట Instagram (huskyindia0) లో 76 వేలకు పైగా సబ్ స్క్రయిబర్స్ కలిగి ఉన్నాడు. హిమ్షి ప్రకారం, అతని కుక్క భారతదేశంలో పారాగ్లైడింగ్ చేసిన మొదటి కుక్క అని, దీని వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఎక్కడికెళ్లినా మా కుక్క నవాబ్‌ డాగ్ ని తీసుకెళ్లేవాళ్లం. మాతో పాటు మనాలి, సిమ్లా, హరిద్వార్, బద్రీనాథ్ కూడా వెళ్ళాడు. చాలా సార్లు ట్రెక్కింగ్ కూడా చేసిందని పేర్కొన్నారు.

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్, నేడు ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రముఖ ఆర్థిక వేత్తలతో సమావేశం

సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌తో హిమ్షి ఇబ్బంది పడుతున్నాడు. ఇదంతా సోషల్ మీడియాలో మాత్రమే జరుగుతోందని అన్నారు. కాకపోతే కేదార్‌నాథ్‌లో తమకు ప్రజలంతా ఘనస్వాగతం పలికారు. హిమ్షి మాట్లాడుతూ, 'నవాబ్ గతంలో కూడా మాతో పాటు చాలా దేవాలయాలకు వెళ్లాడు. కానీ కేదార్‌నాథ్ చాలా పెద్ద దేవాలయం. కేదార్‌నాథ్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించ నివ్వక పోతే ఏం జరుగుతుందో అని హిమ్షి భయపడ్డాడు. ఎందుకంటే వారు సుదీర్ఘ ట్రెక్కింగ్ (సుమారు 16 కిలోమీటర్లు కాలినడకన) తర్వాత కేదార్‌నాథ్ చేరుకున్నారు.

హిమ్షి, ఆమె భర్త రోహన్ త్యాగి కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లారు

కానీ అలాంటిదేమీ జరగలేదు. కేదార్‌నాథ్‌లో ఉన్న తన కుక్కకు అందరూ చాలా ప్రేమను ఇచ్చారని హిమ్షి చెప్పింది. అతనికి ఎవరూ భయపడలేదని. పలువురు తమ కుక్కతో ఫొటోలు దిగారు. భక్తులు, పూజారులు కూడా బాగానే ప్రవర్తించారు. హిమ్షి చెప్పిన విషయం ప్రకారం, కొంతమంది నవాబ్ డాగ్ పాదాలను కూడా తాకి, దానిని భైరవ స్వరూపమమని పొగిడినట్లు తెలిపారు.

అయితే వీడియోలు వైరల్ అయిన తర్వాత తనకు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని హిమ్షి త్యాగి తెలిపారు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో అడుగుపెట్టడానికి కూడా అనుమతించడం లేదని కొందరు ట్రోలర్లు చెబుతున్నారు. తామేమీ తప్పు చేయలేదని, తమను ఆపడానికి అలాంటి వ్యక్తులు ఎవరని హిమ్షి చెప్పింది.