Kedarnath Temple covered with snow (Photo Credits: ANI)

Kedarnath, NOV 02: చార్‌ధామ్‌గా (Chardham) ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి (Gangothri), యుమునోత్రి, బద్రీనాథ్‌ (Badinath), కేదార్‌నాథ్ (Kedarnath) ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయనున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra) కొనసాగుతుంది. కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్‌ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు.

TGSRTC Special Buses: ప్ర‌యాణికుల‌కు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్, వాటిలో చార్జీల త‌గ్గింపు, కార్తీక మాసం సంద‌ర్భంగా ప్ర‌త్యేక స‌ర్వీసులు 

చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్‌ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్‌ ధామ్‌ను నవంబర్‌ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు.