 
                                                                 New Delhi, April 14: కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) ఎంపీల ప్రత్యేక సీట్ల కోటా రద్దు (Seats Quota) అయింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) అన్ని కేంద్రీయ విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రతి ఏడాదిలో ఒక్కో ఎంపీకి పది సీట్లు కేటాయించింది. తాజా ఉత్తర్వులతో ఆ కోటా పూర్తిగా రద్దు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) సర్క్యూలర్ జారీ చేసింది. పార్లమెంట్ సభ్యులతో పాటు ఇతర కోటాల కింద భర్తీ చేసే సీట్ల భర్తీ ప్రక్రియను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల(Kendriya Vidyalaya Admissions) కోసం ఎంపీల కోటాను పెంచాలని గత కొంత కాలంగా పార్లమెంట్ సభ్యల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏకంగా ఎంపీ కోటా సీట్లు మొత్తాన్ని రద్దు చేస్తూ కేవీఎస్ నిర్ణయం తీసుకుంది.
కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాపై లోక్‌సభలోనూ చర్చ జరిగింది. అయితే ఎంపీల కోటాను ఎత్తి వేయాలని కొందరు.. ఆ సీట్లను మరిన్ని పెంచాలని మరికొందరు డిమాండ్ చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది.
ఆ వెంటనే స్పీకర్ ఓం బిర్లా కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను (Dharmendra Pradhan) ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 10 సీట్ల ఎంపీ కోటా సరిపోదని, సీట్లను మరింత పెంచాలని పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. లేదంటే ఎంపీ కోటానే రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి డిమాండ్ చేశారు. అయితే ఎంపీల కోటాను రద్దు చేసే యోచనలో కేంద్రం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడంతో పలువురు ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
