Bank Holiday Alert: బ్యాంకులో పనుందా? బీఅలర్ట్, వరుసగా నాలుగురోజులు సెలవులు, ఏదైనా పని ఉంటే శనివారమే దిక్కు, ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు బ్యాంకులు బంద్ ఉన్నాయో తెలుసా?
Employees Representational Image Photo Credit: PTI)

New Delhi, April 14: బ్యాంకింగ్ సేవలకు మరోసారి ఆటంకం కలగనున్నాయి. సెలవులతో కస్టమర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈరోజు ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanthi) సందర్భంగా, రేపు ఏప్రిల్ 15 న గుడ్ ఫ్రైడే (Good Friday) సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులకు సెలవు (Bank Holiday) ప్రకటించారు. ఇక శనివారం ఏప్రిల్ 16న ఒక్కరోజు బ్యాంకులు తెరుచుకోనుండగా.. మళ్ళీ ఆదివారం సెలవు ఉంది. ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతితో పాటు ఇదే రోజు మహావీర్ జయంతి (Mahavir Jayanthi), వైశాఖి (Vishakhi), తమిళనాడు న్యూ ఇయర్ (Tamilnadu Nw year), బిజు ఫెస్టివల్ కూడా వస్తున్నాయి. దీంతో మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 14న బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది. అలాగే ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడేతో పాటు బెంగాలీ న్యూ ఇయర్, హిమాచల్ డే వస్తున్నాయి.

Mumbai Shocker: భార్యపై 11 ఫేక్ అకౌంట్లతో లైంగిక వేధింపులకు పాల్పడిన భర్త, త్రిపుల్ తలాక్ విధానంలో విడాకులు ఇచ్చాడని కేసు పెట్టిన భార్య, ప్రతీకారంతో ఫేక్ అకౌంట్లతో అసభ్యకరమైన మేసేజ్‌లు

రాజస్తాన్, జమ్మూకశ్మీర్, శ్రీనగర్ మినహా ఏప్రిల్ 15న అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మూతపడనున్నాయి. అనంతరం ఏప్రిల్ 16న కూడా అస్సాంలో బ్యాంకులు మూసి ఉంటాయి. ఈరోజు అస్సాంలో బొహగ్ బిహు పండగను (Bogah Bihu) జరుపుకుంటారు. మిగతా రాష్ట్రాలలో బ్యాంకులు పనిచేస్తాయి.

BedBilble: పోర్న్ వీడియోలు చూస్తూ గంటకు రూ. 15 వందలు సంపాదించే ఉద్యోగం గురించి మీకు తెలుసా, ఇంట్లో కూర్చుని పోర్న్ వీడియోలు చూస్తూ రివ్యూ రాసే జాబ్ ఇస్తున్న బెడ్‌బైబిల్ కంపెనీ

కాబట్టి వినియోగదారులు ఈ తేదీలను గుర్తుపెట్టుకొని అస్సాం మినహా అత్యవసర బ్యాంకు పనులు ఉంటే శనివారం చేసుకోవాల్సి ఉండగా.. మిగతా సాధారణ పనులను సోమవారం అనంతరం వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే నాలుగు రోజులలో శనివారం ఒక్కరోజే వర్కింగ్ డే అంటే సాధారణంగానే కస్టమర్ల రద్దీ ఎక్కువ ఉంటుంది.