Representational Image. (Photo Credits: Pixabay)

Mumbai, April 13: ముంబైలో దారుణం (Mumbai Shocker) చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యనే కనికరం కూడా లేకుండా సోషల్‌ మీడియా వేదికగా ఆమెను వేధింపులకు గురి చేశాడు ఓ శాడిస్టు భర్త. సోషల్ మీడియాలో ఇందుకోసం ఏకంగా 11 ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి ఆమెకు అసభ్యకరమైన మేసేజ్‌లు చేస్తూ వేధించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో త్రిపుల్‌ తలాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, ‘త్రిపుల్ తలాక్ ’ విధానంలో తనకు విడాకులు ఇచ్చాడని ఓ యువతి తన భర్తపై కేసు పెట్టింది. కేసు పెట్టిందన్న కోపంతో ( Upset over triple talaq case) ఆమె భర్త.. జోగేశ్వరి (పశ్చిమ) నివాసి, ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 11 ఫేక్ అకౌంట్లు (man creates fake social media accounts) సృష్టించాడు. ఆ అకౌంట్లతో ఆమెకు.. అసభ్యకరంగా మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆమెతోపాటు, కుమార్తెకు కూడా ఇలా మెసేజ్‌లు పంపించాడు. అతని ఆగడాలకు చిరెత్తిపోయిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. తన భర్త అసభ్యకరమైన మెసేజ్‌లు ( sexually harass wife) పంపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోర్న్ వీడియోలు చూస్తూ గంటకు రూ. 15 వందలు సంపాదించే ఉద్యోగం గురించి మీకు తెలుసా, ఇంట్లో కూర్చుని పోర్న్ వీడియోలు చూస్తూ రివ్యూ రాసే జాబ్ ఇస్తున్న బెడ్‌బైబిల్ కంపెనీ

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధితురాలు ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదులో, డిసెంబర్ 2021 నుండి కొన్ని తెలియని ఖాతాల నుండి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో లైంగిక అసభ్యకరమైన సందేశాలు వస్తున్నాయని ఆ మహిళ తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీలోని పలు సెక్షన్లు, ఐటీ చట్టంలోని 66సీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి, 2021లో ట్రిపుల్ తలాక్ చెప్పిన బాధితురాలి భర్తగా తేలిన నిందితుడిని గుర్తించారు. ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 కింద మహిళ అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై కలత చెందిన అతను ఆన్‌లైన్‌లో ఆమెను వేధించడం ప్రారంభించాడని ఆరోపించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ నేరం బెయిలబుల్ కావడంతో మంగళవారం ఇక్కడి కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.