Kerala: య్యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ డెలివరీ చేసుకున్న మైనర్ బాలిక, కేరళలో ఘటన, చిన్నారి ఏడుపు వినిపించడంతో బయటపడ్డ ఉదంతం, తల్లీబిడ్డ క్షేమం
Girl falls in waterfall (Photo Credits: Pixabay, Representational Image)

Kerala, October 28: య్యూట్యూబ్ ! మొదట్లో దీన్ని వినోదం కోసమే ఉపయోగించేవారు. కానీ రాను రానూ తమకు తెలియని ఏ విషయాన్నైనా య్యూట్యూబ్ ద్వారా తెలుసుకోవడం మొదలుపెట్టారు ప్రజలు. అయితే య్యూట్యూబ్‌ చూస్తూ డెలివరీ చేసుకుంది కేరళకు చెందిన ఓ మైనర్. పాక్షికంగా అంధురాలైన మలప్పురం జిల్లా కొట్టకల్‌ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక, కాబోయే భర్తతో శృంగారంలో పాల్గొన్నది.

గ‌ర్భం రావ‌డంతో ఇంట్లో త‌ల్లికి తెలియ‌కుండా జాగ్రత్తప‌డింది. తీరా డెలివ‌రీ స‌మ‌యం రావ‌డంతో యూట్యూబ్ వీడియోలు చూసి స్వయంగా త‌న‌కు తానే డెలివ‌రీ చేసుకున్నది. బాలిక త‌ల్లికి ప‌సికందు ఏడుపు వినిపించ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి, ఘ‌ట‌న‌కు బాధ్యుడైన 21 ఏండ్ల యువ‌కుడిని అరెస్ట్ చేశారు. పాక్షికంగా అంధురాలైన ఓ మ‌హిళ త‌న 17 ఏండ్ల కూతురుతో క‌లిసి కొట్టకల్‌ పోలిస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నది. ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆమె కుమార్తె ఓ 21 ఏండ్ల యువకుడితో ప్రేమ‌లో ప‌డింది. విష‌యం బ‌య‌టికి రావ‌డంతో పెద్దలు వారి పెండ్లికి అంగీకరించారు.

బీ అలర్ట్.. ప్రయాణికుల వాట్సాప్ చెక్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులు, అందులో గంజాయి ఛాటింగ్ ఉందని తేలితే వెంటనే అరెస్ట్

అయితే, బాలిక మైన‌ర్ కావ‌డంతో ఆమెకు 18 ఏండ్లు నిండిన త‌ర్వాత పెండ్లి చేయాల‌ని నిర్ణయించారు. అంతలోనే ఆ యువకుడితో శృంగారంలో పాల్గొన్న మైనర్ బాలిక గర్భం దాల్చింది. ఈ విష‌యం త‌న త‌ల్లికి తెలియ‌కుండా జాగ్రత్తప‌డింది. తీరా డెలివ‌రీ స‌మ‌యం రావ‌డంతో ఈ నెల 20న యూట్యూబ్‌ వీడియో సాయంతో సొంతంగా డెలివ‌రీ చేసుకుని ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. బొడ్డుతాడు కూడా కత్తిరించుకుంది. ఆమె త‌ల్లికి బిడ్డ ఏడుపు వినప‌డ‌టంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

డెలివ‌రీ అనంత‌రం బాలింత‌కు ఇన్‌ఫెక్షన్ సోక‌డంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు విష‌యం తెలుసుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేశారు. బాధిత బాలికను, ఆమె త‌ల్లిని విచారించి ఘ‌ట‌న‌కు బాధ్యుడైన యువ‌కుడిని అరెస్ట్ చేశారు. అత‌నిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో త‌ల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నార‌ని వైద్యులు తెలిపారు.