Prime Minister Narendra Modi and LS Speaker candidate Om Birla (Photo Credit: ANI)

New Delhi, June 26: అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 18వ పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ ఎన్నిక (Speaker of House) అనివార్యం అయింది. దీంతో ఇవాళ ఉదయం 11గంటలకు లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎంపికపై ఎన్నిక జరగనుంది. ఎన్టీయే నుంచి స్పీక‌ర్ అభ్య‌ర్ధిగా ఉన్న ఓం బిర్లాను (Om Birla) ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌తిపాదిస్తూ తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఆ త‌ర్వాత స‌భ్యుల ఓటింగ్ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే కూటమి (NDA) నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కేరళ ఎంపీ కే. సురేష్ (K. Suresh) బరిలో ఉన్నారు. లోకసభ స్పీకర్ ఎన్నికలో ఏపీ నుంచి తెలుగుదేశం, జనసేన ఎంపీలు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వైసీపీకి(YSRCP) చెందిన నలుగురు ఎంపీలు ఎవరికి మద్దతు ఇస్తారని చర్చజరిగింది.

 

అయితే, వైసీపీ మద్దతు ఎన్డీయేకి అని తేలింది. స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాకే వైసీపీ ఎంపీలు ఓటు వేయనున్నారు. స్పీకర్ ఎన్నికల్లో మద్దతుకోసం వైవీ సుబ్బారెడ్డికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. తమ మద్దతు ఎన్డీయే అభ్యర్థికి ఉంటుందని బీజేపీకి వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభలో వైసీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. గతంలో వైసీపీకి 22 ఎంపీలు ఉన్న సమయంలోనూ పార్లమెంట్ లో బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఏపీలో, కేంద్రంలో టీడీపీ భాగస్వామిగాఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఉన్నా తమ మద్దతు ఎన్డీయేకే అని వైసీపీ చెప్పడం గమనార్హం. అయితే, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి వైసీపీ దూరంగా ఉంటూ వస్తుంది.

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ, విపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడం 2014 ఎన్నికల తర్వాత ఇదే తొలిసారి.. 

గత 50 ఏండ్లలో తొలిసారిగా, స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరుగనున్నది. వాస్తవానికి స్పీకర్‌ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్‌ పదవిని విపక్షం చేపట్టడం సంప్రదాయంగా వస్తున్నది. అయితే గత పర్యాయంలో డిప్యూటీ స్పీకర్‌ను నియమించలేదు. ఈసారి ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించిన ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్‌ పదవి కోసం పట్టుబట్టింది. అందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో స్పీకర్‌ పదవికి అభ్యర్థిని నిలిపింది.