New Delhi, DEC 13: దేశంలో బుధవారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ (Mohan lal Yadav), ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణు సాయి (Vishnu Sai) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. భోపాల్ నగరంలోని లాల్ పరేడ్ గ్రౌండులో మోహన్ యాదవ్, రాయపూర్ నగరంలోని సైన్స్ కళాశాల మైదానంలో విష్ణు సాయి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.
Rajasthan New CM: రాజస్థాన్ నూతన సీఎంగా భజన్‌లాల్ శర్మను ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం..
రెండు రాష్ట్రాలో సీఎంల ప్రమాణస్వీకారోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi), కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పాల్గొననున్నారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎంలుగా రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరితోపాటు మాజీ కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరుగా వ్యవహరించనున్నారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డాల సమక్షంలో మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ చెప్పారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లు సాధించింది. ప్రధాని మోదీ, జేపీ నడ్డాల సమక్షంలో ఛత్తీస్ ఘడ్ లో విష్ణుసాయి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ నాయకుడు విజయ్ కుమార్ శర్మ చెప్పారు. విష్ణు సాయి సర్పంచ్ స్థాయి నుంచి సీఎంగా ఎంపికయ్యారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు ప్రమాణస్వీకారం చేస్తుండటంతో బుధవారం ఆయా రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తల కోలాహలం ఏర్పడింది.