Madhya Pradesh: స్థలం వివాదం, గట్టు పంచాయతీలు, దొంగతనం కేసులపై పోలీస్ స్టేషన్కు సాధారణంగా ఫిర్యాదులు వస్తుంటాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లాలో విచిత్రమైన కేసుతో పోలీసులకు షాక్ ఇచ్చాడు ఓ రైతు. తన బర్రె పాలు ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ రైతు సమస్య ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టుకున్నారు పోలీసులు.
మధ్యప్రదేశ్‌లోని బింధ్ జిల్లా నాయ్‌గావ్ పోలీస్‌స్టేషన్‌కు ఈ కేసు వచ్చింది. తన గేదె పాలివ్వడం లేదంటూ నేరుగా గేదెను తోలుకొచ్చి ఫిర్యాదు చేశాడు. బాబూ లాల్ జాతవ్ అనే రైతు శనివారం నాయ్‌గావ్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. కొద్దిరోజులుగా తన గేదె పాలివ్వడం లేదని తెలిపాడు. బహుశా ఎవరైనా చేతబడి చేసి ఉంటారని గ్రామస్థులు చెప్పడంతో అతడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు.
మళ్లీ ఓ 4 గంటల తర్వాత వచ్చి ఈ విషయంలో ఏదైనా సాయం చేయాలని పోలీసులను కోరాడు. దీంతో పశువైద్యుడిని సంప్రదించాలని అతడికి నచ్చజెప్పి పంపినట్లు డీఎస్పీ అరవింద్ షా తెలిపారు. మళ్లీ ఆదివారం ఉదయం ఆ రైతు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన గేదె పాలిస్తోందని సంతోషం వ్యక్తంచేశాడని, పోలీసులకు ధన్యవాదాలు కూడా చెప్పాడు రైతు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.