Bhopal, Oct 17: మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 214 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న గుణాలో గత 15 సంవత్సరాలుగా తనపై అత్యాచారం (he raped her for 15 years) చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 31 ఏళ్ల మహిళ కనీసం 25 సార్లు ఒక వ్యక్తిని పొడిచి (woman stabs man 25 times) చంపింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి (Madhya Pradesh Murder) చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతున్ని అశోక్ నగర్ గ్రామ నివాసి బ్రిజ్‌భూషన్ శర్మగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అతనిని చంపేసిన తర్వాత ఆ మహిళ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఈ విషయాన్ని హిందూస్థాన్ టైమ్స్ తన కథనంలొ తెలిపింది.
ఈ కథనం, అలాగే గునాలోని కాంట్ పోలీస్ స్టేషన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాంప్రాకాష్ వర్మ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ నగర్‌లో నివాసముండే శర్మ తనపై గత 15 ఏళ్లుగా అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడు శర్మ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దాంతోపాటు ఆ వీడియోలు తీసి ఇన్నేళ్లుగా బ్లాక్‌మెయిల్ చేశాడని తెలిపింది.పెళ్లి చేసుకుని తన బతుకు తాను బతుకున్నా విడిచిపెట్టలేదని వాపోయింది.
ఆనాటి వీడియోతో నిత్యం వేధిస్తున్నాడని, ఘటన జరిగిన రోజు కూడా అతని తీరు మారలేదని తెలిపింది. పని నిమిత్తం తన భర్త బయటకు వెళ్లాడని, అదే సమయంలో తప్పతాగి వచ్చిన శర్మ తనపై అఘాయిత్యానికి పూనుకున్నాడని చెప్పింది. తీవ్ర ఆగ్రహావేశంతో అతనిపై కత్తితో దాడి చేసి చంపేశానని వెల్లడించింది. ఆ కామాంధుడి వల్ల తన జీవితం నాశనమైందని, తన ఇద్దరు పిల్లలు, భర్తకు దూరంగా జైలు జీవితం గడపాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, నిందితురాలిపై ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టారు.