Indore, March 31: మధ్యప్రదేశ్‌లో వింతశిశువు (Baby) జన్మించింది. రెండు తలలు (Two Heads), మూడు చేతులు ఉన్న శిశువుకు (Three Hands) జన్మనిచ్చింది ఓ మహిళ. మధ్యప్రదేశ్‌లోని (Madhya pradesh) మహారాజా యశ్వంత్ రావ్ హాస్పటల్లో ఈ ఘటన జరిగింది. ఆమెను డెలివరీకి రట్లామ్ (Ratlam) హాస్పిటల్ కు రిఫర్ చేయడంతో ముందస్తు చికిత్స కోసం NICU వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు .పీడియాట్రిక్ సర్జన్ డా. బ్రిజేశ్ లహోటీ మాట్లాడుతూ.. ఈ కండిషన్ ను డైసెఫెలాక్ పారాపగస్ గా వివరించారు. ఈ కారణంతో కాళ్లు, లేదా చేతులు అదనంగా ఉండి పుడతారని తెలిపారు. ‘ఇలాంటి కేసులు అరుదుగా ఉంటాయి. శిశువు పెరిగే తొలి రోజుల నుంచి వీరిపై అబ్జర్వేషన్ ఉంచాలని.. ఇప్పటివరకూ శిశువుపై ఎటువంటి సర్జరీ ప్లాన్ చేయలేదని’ డా. లహోటీ అంటున్నారు. పాపకు రెండు తలలు, ఒక మొండెం, మూడు చేతులు ఉన్నాయని చెప్పారు. రెండు చేతులు మామూలు స్థానంలోనే ఉండగా.. ఒకటి మాత్రం తలకు దగ్గరగా ఉందని తెలిపారు. అంతేకాదు ఆ శిశువుకు రెండు గుండెలు (Two Hearts) ఉన్నట్లు తెలిసింది.
జావోరాలోని నీమ్ చౌక్ లో ఉండే మహిళ రట్లామ్ లోని జిల్లా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చేసిన స్కానింగ్ లో తనకు కవలలు ఉన్నట్లు తెలిసిందన్నారు. అయితే డెలివరీ అయ్యేంత వరకు ఇలా జరుగుతుందని తెలియదని కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే డాక్టర్లు మాత్రం ప్రస్తుతం శిశువుతో పాటూ తల్లి కూడా క్షేమంగా ఉందని, త్వరలోనే శిశువుకు సర్జరీపై ఆలోచన చేస్తామన్నారు.
ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని, దీనిపై సీనియర్ డాక్టర్ల సలహా తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే పాప తల్లిదండ్రులు, బందువులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ శిశువుకు చెందిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.