Jan Dhan Account: జన్ ధన్ అకౌంట్లో రూ.15 లక్షలు, మోదీ వేశాడనుకొని ఇళ్లు కట్టుకున్న రైతు, అప్పట్నించి కష్టాలు షురూ, అప్పులపాలైన మహారాష్ట్ర రైతు

New Delhi, Feb 10: అతనో సామాన్యుడు, వ్యవసాయం చేసుకొని జీవించే వ్యక్తి (Maha farmer). ప్రతి రోజూలాగానే పొలానికి వెళ్లి చేసుకొని వచ్చాడు. ఒక రోజు ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసుకొని ఆశ్చర్యపోయాడు. తన అకౌంట్లో రూ. 15 లక్షలు పడ్డాయి. ఒక్క నిమిషం అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతనికి డబ్బులు పడ్డ అకౌంట్ జన్ ధన్ ఖాతా (Jan Dhan account) అవ్వడంతో ...ప్రధాని మోదీ(PM Modi) తనకు డబ్బులు పంపించాడని ఉబ్బి తబ్బియ్యాడు. ఇంకేముంది దాంతో కష్టాలు తీరిపోయాయి అనుకున్నాడు. కానీ అతనికి కష్టాలు తీరకపోగా....అప్పులు మొదలయ్యాయి. అసలు ఏం జరిగిందంటే... మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్ జిల్లా ( Aurangabad district) పైతాన్ తాలుకాకు చెందిన జ్ఞానేశ్వ‌ర్ ఓటే(Gyaneshwar Ote) అనే రైతు జన్ ధన్ ఖాతో 15 లక్షలు జమయ్యాయి. గ‌త సంవ‌త్స‌రం ఆగ‌స్టులో ఈ ఘటన జరిగింది.

ప్రధాని మోదీయే తనకు డబ్బులు పంపించాడని ఆనందపడ్డ జ్ఞానేశ్వర్.... వెంట‌నే మోదీకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఓ మెయిల్ పంపించాడు. అందులో నుంచి 9 ల‌క్ష‌లు విత్‌డ్రా చేసి సొంతిల్లు నిర్మించుకున్నాడు (build a house). అంతా బాగానే ఉంది. త‌న లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్నాడు. ఇల్లు క‌ట్ట‌డం కోసం 9 ల‌క్ష‌లు ఖ‌ర్చు కాగా.. అకౌంట్‌లో 6 ల‌క్ష‌లు ఉన్నాయి. వాటితో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని అనుకుంటాడు జ్ఞానేశ్వ‌ర్.

SBI Services Fee: సర్వీస్ ఛార్జీల పేరుతో రూ.346 కోట్లు పిండేసిన ఎస్‌బీఐ, ఆ ఛార్జీలను వెనక్కు ఇచ్చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచన, కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల

కానీ ఆరు నెలల తర్వాత అసలు మ్యాటర్ బయటపడింది. జ్ఞానేశ్వర్ అకౌంట్లో పొరపాటున డబ్బులు పడ్డాయని 6 నెల‌ల త‌ర్వాత బ్యాంక్ నాలుక క‌రుచుకుంది. పింప‌ల్‌వాడీ అనే గ్రామ పంచాయ‌తీకి అభివృద్ధి కార్య‌క్ర‌మాల కోసం ఆ డ‌బ్బుల‌ను గ్రామ పంచాయ‌తీ అకౌంట్‌లోకి పంపించ‌బోయిన బ్యాంక్.. పొర‌పాటును జ్ఞానేశ్వర్ ఖాతాలో జ‌మ చేసింది. ఈ విష‌యం తెలుసుకొని వెంట‌నే జ్ఞానేశ్వ‌ర్‌కు బ్యాంక్ లెట‌ర్ పంపించింది. వెంట‌నే 15 లక్ష‌ల‌ను తిరిగి చెల్లించాల‌ని డిమాండ్ చేసింది. కానీ.. అప్ప‌టికే జ్ఞానేశ్వ‌ర్ 9 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్ట‌గా.. త‌న ఖాతాలో ఉన్న 6 ల‌క్ష‌ల‌ను మాత్రం బ్యాంక్‌కు చెల్లించాడు. మిగితా 9 ల‌క్ష‌లు ఎలా చెల్లించాలా అని త‌ల‌ప‌ట్టుకొని కూర్చున్నాడు.