Maharashtra Blast: ఒక్కసారిగా పేలుడు, నలుగురి సజీవ దహనం, పలువురికి తీవ్ర గాయాలు, మహారాష్ట్రలో రత్నాగిరి జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన
Representational Image (Photo Credits: IANS)

Mumbai, Mar 20: మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని (Maharashtra Blast) నింపింది. రత్నాగిరి జిల్లాలోని ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఘర్డా కెమికల్స్ వద్ద శనివారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి (Explosion at Chemical Factory in Ratnagiri) ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే సజీవ దహనం (4 Dead, One Critically Injured) కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఇరుక్కున్న 40 -50మందిని అగ్నిమాపక దళ సిబ్బంది రక్షించింది. క్షతగాత్రులను సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలించిన అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తీవ్రంగా గాయపడినవారిని ముంబైకి తరలిస్తున్నారు.

భయానక వీడియో..లోయలో పడిన బస్సు, 14 మంది అక్కడికక్కడే దుర్మరణం, 30 మందికి తీవ్ర గాయాలు, శ్రీలంకలో పసరా పట్టణానికి సమీపంలో విషాద ఘటన

ఈ ప్రమాదం వెనుక గల కారణాన్ని ఇంకా నిర్ధారించలేదు. అయితే బాయిలర్ పేలుడు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.