Mumbai, Feb 1: మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధానేలోని భీవండి పట్టణంలో గత ఓ భవనం కుప్ప కూలిపోయింది. ఇందులో ఎనిమిది మంది చిక్కుకున్నారని సమాచారం. థానే పట్టణంలో వాణిజ్య సముదాయంలో భవనం కూలిపోవడంతో (Building Collapses in Thane) దాదాపు ఎనిమిది మంది ఇందులో చిక్కుకున్నట్లు పౌర అధికారి తెలిపారు. మంకోలి నాకాలోని హరిహర్ కాంపౌండ్‌లో ఉదయం 10.30గంటల సమయంలో గోడౌన్‌గా ఉన్న భవనం కూలిపోయిందని థానే పౌర సంఘం ప్రాంతీయ విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ సంతోష్ కదమ్ తెలిపారు.
గోడౌన్‌లో పని చేస్తున్న ఏడు నుంచి ఎనిమిది మంది శిథిలాల కింది చిక్కుకున్నారని ఆయన తెలిపారు. రెస్క్యూ ఫోర్స్, విపత్తు నిర్వహణ సెల్, భీవండి, థానేకు చెందిన అగ్నిమాపక సేవల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. వారు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సహాయం కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా గతేడాది మహారాష్ట్రలోని భీవండి నగరంలోనే మూడంతస్తుల భవనం (Bhiwandi Building Collapse) ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో దాదాపు పది మందికి పైగా మృతి చెందగా.. చాలామందికి గాయాలయ్యాయి.