Maharashtra Election 2024 Live Updates RSS Chief Mohan Bhagwat Shows 'Inked Finger'(video grab0

Hyd, Nov 20:  దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 9.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఉదయమే ఓటేశారు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బాధ్యత అని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు మోహన్ భగవత్.

రాజ్​భవన్​ వద్ద ఉన్న పోలింగ్ స్టేషన్​లో ఓటేశారు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ . భారత్​ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం సీనియర్ పౌరులు, మహిళలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు రాధాకృష్ణన్. నచ్చినవారికి ఓటర్లు ఓటు వేయొచ్చు, కానీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవాలన్నారు. అలాగే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బారామతి ఎన్​సీపీ అభ్యర్థి అజిత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతి ఓటర్లు భారీ మెజారిటీతో తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.  మహారాష్ట్రలో పవన్ ఎన్నికల ప్రచారం, మజ్లిస్ పార్టీపై పంచ్‌లు..శివసేన-జనసేన ధర్మం కోసమే పోరాడుతాయని వెల్లడి 

Here's Video:

మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామం ప్రధానంగా ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా సాగింది. మహాయుతి పేరుతో ఎన్డీయే పక్షాలు బరిలో నిలవగా మహావికాస్ అఘాడీ పేరుతో ఇండియా కూటమి పోటీ చేసింది. మహాయుతిలో భాగంగా బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన 81, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆధ్వర్యంలోని NCP 59 మందిని బరిలో నిలిపింది.

మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్‌ 101 మంది అభ్యర్థులను బరిలో నిలపగా శివసేన యూబీటీ 95, NCP శరద్‌చంద్ర పవార్ పార్టీ 86 మందిని పోటీకి దించింది. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా, ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.