Mumbai, January 28: మద్యంపాలసీలో పలు కీలకమార్పులను తీసుకువస్తూ నిర్ణయాలు తీసుకుంది మహారాష్ట్ర కేబినెట్ (Maharashtra Cabinet). ఇకపై సూపర్ మార్కెట్లు(Super Markets), వాక్ ఇన్ స్టోర్ల (walk-in stores)లోనూ వైన్ (Wine) అమ్మకాలను పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించింది. 1000 చదరపు గజాలు అంతకుమించిన విస్తీర్ణంలో ఉన్న సూపర్ మార్కెట్లు, స్టోర్లలో స్టాల్ ద్వారా వైన్ విక్రయాలకు(Loquor sales) అనుమతిస్తూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే(CM Uddav) అధ్యక్షతన జరిగిన క్యాబినెట్(Maharashtra cabinet ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (minister Nawab Malik ) ప్రకటించారు.
ఈ నిర్ణయం వైన్ తయారీదారులతో పాటు మహారాష్ట్ర రైతాంగానికి మేలు చేస్తుందని మంత్రి చెప్పారు. సూపర్ మార్కెట్లు, స్టోర్లలో వైన్ విక్రయాలతో రాష్ట్ర సర్కార్‌కు ఆదాయం కూడా సమకూరుతుందని అన్నారు. ఇక తాజా నిర్ణయంతో మహారాష్ట్రలో కనీస విస్తీర్ణం కలిగిన సూపర్ మార్కెట్లు, జనరల్ స్టోర్స్, వాక్-ఇన్-స్టోర్స్‌లో వైన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దేశీ వైన్ పరిశ్రమలో 65 శాతం యూనిట్లు మహారాష్ట్రలోనే ఉన్నాయి. వీటిలో అధిక శాతం యూనిట్లు నాసిక్, సంగ్లి, పుణే, సోలాపూర్, బుల్ధానా, అహ్మద్‌నగర్ జిల్లాల్లో ఉన్నాయి.
మరోవైపు సూపర్ మార్కెట్లు, స్టోర్స్‌లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై బీజేపీ భగ్గుమంటోంది. వీధివీధినా మద్యం దుకాణాలను తెరుస్తున్నారని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలకు బీజేపీ సన్నద్ధమవుతోంది.
తమ నిర్ణయాన్ని శివసేన ప్రభుత్వం మాత్రం సమర్ధించుకుంటోంది. వైన్ విక్రయాలు పెరగడం ద్వారా వైన్ పరిశ్రమపై ఆధారపడ్డ రైతులకు ఉపాధి పెరుగుతుందని ఆ పార్టీ నేతలంటున్నారు. మహా కేబినెట్ నిర్ణయాలను త్వరలోనే అమలు చేస్తామంటున్నారు. సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయం కోసం రూ.5వేలు చెల్లించి పర్మిషన్ తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే విద్యాసంస్థలు, ప్రార్ధనామందిరాలకు దగ్గర్లో ఉన్న స్టోర్లకు మాత్రం వైన్ విక్రయాల కోసం అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు మంత్రి నవాబ్ మాలిక్.