Stabbing | Image Used for Representational Purpose (Photo Credits: Maxpixel)

Bangalore, SEP 18: పరిచయం ఉన్న యువతిని వృద్ధుడు పార్కుకు పిలిచాడు. అక్కడ ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. వారిద్దరూ మరోసారి పార్కులో కలుసుకున్నారు. ఇంతలో అక్కడకు వచ్చిన యువతి ప్రియుడు ఆ వ్యక్తిని కత్తితో పొడిచాడు. (Old Man Stabbed) ఈ విషయం తెలిసిన పోలీసులు గాయపడిన వృద్ధుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కత్తితో పొడిచిన యువతి, ఆమె ప్రియుడ్ని అరెస్ట్‌ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 60 ఏళ్ల హితేంద్ర కుమార్‌కు జయనగర్‌లో క్లాత్‌ షాప్‌ ఉంది. ఒక యువతి కొన్ని నెలలపాటు అతడి షాప్‌లో పని చేసి మానేసింది. కాగా, బీటీఎం లేఅవుట్‌లోని కేఈబీ పార్క్‌లో హితేంద్ర కుమార్‌, ఆ యువతి కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రేమను ఆమెకు ప్రజోజ్‌ చేశాడు. సెప్టెంబర్‌ 15న కూడా వారిద్దరూ ఆ పార్కుకు వెళ్లారు. ఒక బెంచ్‌పై కూర్చొన్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో యువతి స్నేహితుడు సిద్ధు ఆ పార్క్‌కు వచ్చాడు. హితేంద్ర కుమార్‌పై కత్తితో దాడి చేశాడు. కడుపులో ఇతర భాగాలపై కత్తితో పొడిచాడు. దీంతో హితేంద్ర కుప్పకూలిపోయాడు.

Kamareddy School Bus Fire: వీడియో ఇదిగో, బ్యాటరీ పేలి ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు, భయంతో కేకలు వేసిన విద్యార్థులు 

మరోవైపు ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన హితేంద్రను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి ఫిర్యాదుతో యువతి, ఆమె ప్రియుడ్ని అరెస్ట్‌ చేశారు. అయితే క్లాత్‌ షాపులో పని చేసినప్పుడు హితేంద్ర తనను వేధించినట్లు ఆ యువతి ఆరోపించింది. పార్క్‌లో తనకు ప్రపోజ్‌ చేయడం గురించి తన ఫ్రెండ్‌కు చెప్పినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో యువతి ప్రియుడు ఆ వృద్ధుడిపై దాడి చేశాడా? లేక వారిద్దరూ కలిసి నేరానికి కుట్ర పన్నారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హితేంద్ర, ఆ యువతి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను పరిశీలిస్తున్నారు. అలాగే బట్టల షాపులోని మిగతా సిబ్బంది స్టేట్‌మెంట్లను కూడా రికార్డ్‌ చేశారు.