Karnataka Assembly

Bangalore, July 07: బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండగా (Karnataka Budget session) ఒక వ్యక్తి అసెంబ్లీలోకి ప్రవేశించాడు. ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే సీటులో కూర్చొన్నాడు. గమనించిన మరో ఎమ్మెల్యే అసెంబ్లీ భద్రతా సిబ్బందిని అలెర్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విస్తూపోయే ఈ సంఘటన కర్ణాటకలో (Karnataka) జరిగింది. ఆ రాష్ట్రంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఏర్పడంతో సీఎం సిద్ధరామయ్య శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాగా, బడ్జెట్‌ సమావేశం కావడంతో సభ్యులంతా బిజీగా ఉన్నారు. ఇంతలో 70 ఏళ్ల వ్యక్తి నేరుగా అసెంబ్లీలోకి ప్రవేశించాడు. ఖాళీగా ఉన్న జేడీఎస్‌ ఎమ్మెల్యే కరియమ్మ (Kariyamma) సీటులో కూర్చొన్నాడు. బడ్జెట్‌ సమావేశాలను తిలకించాడు. అయితే పక్క సీటులో ఉన్న జేడీఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే ఆ అపరిచిత వ్యక్తిని గమనించారు. వెంటనే అసెంబ్లీ కార్యదర్శి, సిబ్బందిని అలెర్ట్‌ చేశారు. దీంతో అసెంబ్లీ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని బయటకు తీసుకెళ్లారు. పోలీసులకు అప్పగించగా అతడ్ని అరెస్ట్‌ చేశారు.

PM Modi in UP: సావన్ పండుగ సందర్భంగా కాశీకి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారు, యూపీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 

మరోవైపు ఎలాంటి అనుమతి లేకుండా అసెంబ్లీలోకి నేరుగా ప్రవేశించిన ఆ వృద్ధుడ్ని చిత్రదుర్గ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తాను ఎమ్మెల్యేనంటూ అతడు అసెంబ్లీకి ప్రవేశించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీలోకి అతడు వెళ్లినట్లు గ్రహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్ల లోపాలపై విమర్శలు వెల్లువెత్తాయి.